అమెరికన్ తీసిన మెరుపు వీడియో..దూసుకెళ్తోంది..!!!!

మెరికాలో తుఫాను లు సృష్టించే ప్రకంపనలు అన్నీ ఇన్నీ కావు, ఇక టోర్నడోల సంగతి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.

వాటి ధాటికి చెట్లకు చెట్లే పెకటించుకు పోయి గాలిలో కొట్టుకుపోతాయి.అయితే తాజాగా అమెరికాలో తుఫాను బీభత్సం సృష్టించింది.

అనేక రాష్ట్రాలు ఈ తుఫాను ధాటికి అల్లకలోలం అయ్యాయి.కొన్ని కోట్ల మేరకు నష్టం వాటిల్లింది.

అంతేకాదు """/"/ ఈ తుఫాను ధాటికి దాదాపు 10 మంది దుర్మరణం చెందారు.

డల్లాస్ ప్రాంతంలో క్రేన్ కుప్పకూలందతో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది.టెక్సాస్ రాష్ట్రంలో ఉరుములు మెరుపులతో భారీ వర్షాలు కురిశాయి.

టెక్సాస్‌లోని స్పైస్‌వుడ్ నగరానికి చెందిన ఓ ఫోటో గ్రాఫర్ ఆకాశంలో ఉన్న మెరుపులని తన ఐ ఫోన్ లో స్లో మోషన్ తో వీడియో తీసి సోషల్ మీడియా లో పెట్టడంతో ఒక్క సారిగా ఆ వీడియో ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అయ్యింది.

అతడు తీసిన ఈ వీడియోలో మెరుపులు ఒక ప్రాంతం నుంచీ మరొక ప్రాంతానికి వెళ్ళడం స్పష్టంగా కనిపిస్తోంది.

తుఫాను కారణంగా తాము ఎంతో భయంతో ఇంట్లో గడిపామని, ఆసమయంలో తాను తీసిన వీడియో చూసి ఆశ్చర్యపడ్డానని, ఇది అందరికి చూపించాలనే కోరికతో సోషల్ మీడియాలో పోస్ట్ చేశానని అతడు తెలిపారు.

అమ్మ చెప్పిన మాటతో బిజినెస్ తో పాటు మోటివేషనల్ స్పీకర్.. ప్రీతిక సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!