అమెరికా మహిళా రికార్డ్..చేతుల్లేవు అయినా...

ఆత్మవిశ్వాసం ఉంటే సాధించలేనిది ఏదీ లేదు.కొండనైనా పిండి చేయగల సామర్ధ్యం ఉండాలంటే ముందుగా ఉండాల్సిందే ధృడమైన సంకల్పం.

ఆ ఒక్క సంకల్పం, ఆత్మ విశ్వాసం ఉంటే అనుకున్నది సాధించడం ఎంతో సులభతరం అవుతుంది.

ఈ సంకల్పమే అమెరికాలో ఓ మహిళకి చేతులు లేకపోయినా విమానం నడపగలిగే ధైర్యాన్ని ఇచ్చింది.

వివరాలలోకి వెళ్తే.అమెరికాలోని ఆరిజోనా కి చెందిన జెస్సికా కాక్స్ చేతుల్లేవని ఎన్నడూ బాధపడలేదు.

ఎంతమంది తనని గేలి చేసిన తన ఆత్మవిశ్వాసం చెక్కు చెదరలేదు.పుట్టుకతో వచ్చిన ఈ వైకల్యాన్ని ఎదిరించింది.

పైలెట్ కావాలనే కోరికతో ఏకంగా ఇప్పుడు విమానాన్నేనడిపి రికార్డ్ సృష్టించింది.చేతుల్లేని తొలి పైలట్‌గా లైసెన్స్ ని కూడా అమెరికా విమానయాన శాఖ నుంచీ సాధించింది.

"""/"/ అంతేకాదు కేవలం మూడంటే మూడేళ్ళలో పైలెట్ శిక్షణ పూర్తి చేసుకున్న ఆమె మార్షల్‌ ఆర్ట్స్ లో సైతం బ్లాక్ బెల్ట్ సాధించడం మరొక విశేషం.

పియానో, సర్ఫింగ్ , కారు డ్రైవ్ చేయడం లో ఆమెకి సాటి ఎవరూ రారు అంటున్నారు ఆమె సన్నిహితులు.

స్కూబా డైవర్‌ గా కాక్స్‌ లైసెన్స్‌ కూడా పొందింది ఆమె.మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఎంతో మందిలో స్పూర్తిని నింపే ప్రసంగాలు చేయడంలో ఆమె మంచి పేరు కూడా సంపాదించుకుంది.

"""/"/ .

ఉక్రెయిన్‌లోని ప్రముఖ హ్యారీ పోటర్ కోట నాశనం.. ఫ్యాన్స్ హార్ట్ బ్రేక్..?