చెరువులో మునిగిపోయిన కూతుళ్లు.. కాపాడుతూ ప్రాణాలొదిలిన తండ్రి, కంటతడి పెట్టిస్తున్న విషాద ఘటన

అమెరికాలోని మైనేలో విషాదం చోటు చేసుకుంది.చెరువులో మునిగిపోతున్న తన ఇద్దరు కుమార్తెలను రక్షించే ప్రయత్నంలో ఓ తండ్రి ప్రాణాలు కోల్పోయాడు.

హోప్‌కు చెందిన 46 ఏళ్ల హెన్రీ బ్రూక్స్( Henry Brooks ) తన కుమార్తెలు నీటిలో మునిగిపోవడం గమనించి వెంటనే చెరువులోకి దూకాడు.

ఇతని కుమార్తెలు మైనేలోని సెవెన్ ట్రీ పాండ్‌లోని( Seven Tree Pond ) లోతైన ప్రాంతంలో మునిగిపోయినట్లు మైనే వార్డెన్ సర్వీస్ తెలిపింది.

శనివారం నదీలోకి చెరువు నీరు సంగమించే ప్రదేశానికి సమీపంలోని లోతైన ప్రదేశంలో ప్రమాదవశాత్తూ ఓ బాలిక పడిపోయింది.

ఆమెను రక్షించేందుకు ఆమె సోదరి నీటిలోకి దూకింది.వీరిద్దరిని రక్షించేందుకు కొడుకుతో కలిసి హెన్రీ చెరువులోకి దూకుడు అయితే పిల్లలను కాపాడే సమయంలో అతను లైఫ్ జాకెట్ ధరించలేదని న్యూయార్క్ పోస్ట్ కథనంలో పేర్కొంది.

హెన్రీ కొడుకు తన చెల్లెళ్లను రక్షించి తీరానికి సురక్షితంగా తీసుకొచ్చాడు.హెన్రీ గల్లంతు కావడంతో సహాయక బృందాలు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాయి.

కాసేపటి తర్వాత అతని మృతదేహాన్ని తీరానికి 50 అడుగుల దూరంలో మైనే వార్డెన్ సర్వీస్ సిబ్బంది కనుగొని వెలికి తీశారు.

"""/" / ఇకపోతే.జూన్ 29న పెన్సిల్వేనియాలో అచ్చం ఇదే తరహాలో జరిగిన ఘటనలో నీటిలో మునిగిపోతున్న ఇద్దరు పిల్లల ప్రాణాలను కాపాడుతూ ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు.

మృతుడిని మార్విన్ అలెగ్జాన్‌ ఫెర్నాండెజ్ చికాస్‌గా గుర్తించారు.ఇతను తన మూడేళ్ల కొడుకు డయాల్న్‌, మరికొందరు స్నేహితులతో కలిసి లేక్ నొకమిక్సన్‌ వద్ద గడుపుతున్నాడు.

అయితే ఆ సమయంలో ప్రమాదవశాత్తూ ఇద్దరు పిల్లలు నీటిలో పడిపోయారు.దీనిని గమనించిన మార్విన్ తనకు ఈత రాకపోయినప్పటికీ వారిని కాపాడి తను మునిగిపోయాడు.

పది మంది డైవర్లు ఆ ప్రాంతాన్ని జల్లెడ పట్టి చివరికి మార్విన్ మృతదేహాన్ని వెలికితీశారు.

"""/" / ఇదే తరహాలో జరిగిన మరో ఘటనలో ఓ తెలుగు ఎన్ఆర్ఐ కూడా ప్రాణాలు కోల్పోయాడు.

మృతుడిని ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల జిల్లా అద్దంకి మండలానికి చెందిన 42 ఏళ్ల పొట్టి వెంకట రాజేష్ కుమార్‌గా( Potti Venkata Rajesh Kumar ) గుర్తించారు.

అమెరికా స్వాతంత్య్ర దినోత్సవమైన జూలై 4వ తేదీన సెలవుకావడంతో రాజేశ్ కుటుంబం విహారయాత్ర కోసం ఫ్లోరిడాలోని జాక్సన్‌విల్లే బీచ్‌కి వెళ్లారు.

ఈ క్రమంలో పిల్లలు సముద్రంలో మరింత ముందుకు వెళ్లడాన్ని గమనించిన రాజేశ్ వారి వెనుకే పరిగెత్తి తన కొడుకును రక్షించేందుకు యత్నించాడు.

"""/" / ఈలోగా మరో పెద్ద అల రాజేష్‌ను లోపలికి లాక్కెళ్లిందని విజయ్ కుమార్ మీడియాకు తెలిపారు.

సహాయక బృందాలు, తోటి పర్యాటకులు అతనిని రక్షించి ఒడ్డుకు చేర్చే సమయానికి రాజేశ్ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు.

దీంతో అతనిని హెలికాఫ్టర్‌లో ఆసుపత్రికి తరలించారు.ఊపిరితిత్తుల్లోకి నీరు చేరడంతో తండ్రితో పాటు కొడుకు కూడా స్పృహతప్పి పడిపోయాడని విజయ్ కన్నీటి పర్యంతమయ్యారు.

ఆసుపత్రిలో రాజేష్ కుమారుడు షాక్ ట్రీట్‌మెంట్‌కు స్పందించగా అతనికి వైద్యులు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు.

కానీ రాజేష్ మాత్రం తుదిశ్వాస విడిచాడు.

కెనడాలో ముగిసిన కాన్సులర్ క్యాంప్‌లు .. ఊపిరి పీల్చుకున్న ఇండియన్ ఎంబసీ