Zachary Clements : నక్క తోక తొక్కిన అమెరికన్‌ డ్రైవర్.. తగిలిన రూ.80 లక్షల లాటరీ..!

కొంతమంది ప్రజలు తమకు అదృష్టం వరిస్తుందని ఎప్పుడూ అనుకోరు.అదృష్టం దక్కాలనే ఆశ వారికి ఉంటుందేమో కానీ నమ్మకం మాత్రం చాలా తక్కువగా ఉంటుంది.

అలాంటివారు కష్టం చేస్తూనే బతుకుతుంటారు.అయితే ఇలాంటి నమ్మకాలతో ఉన్న చాలామంది వ్యక్తులకు లాటరీలు( Lottery ) తగిలి ఆశ్చర్యపరిచాయి.

కూలీ పని చేసే వ్యక్తి నుంచి ఆటో డ్రైవర్ వరకు ఎంతోమందిని అదృష్టం లాటరీ రూపంలో పలకరించింది.

దీనివల్ల వారి జీవితాలు పూర్తిగా మారిపోయాయి. """/" / తాజాగా ఒక అమెరికన్ డెలివరీ డ్రైవర్ జీవితం కూడా లాటరీ తో ఒక మలుపు తిరిగింది.

జాకరీ క్లెమెంట్స్( Zachary Clements ) వర్జీనియాలో డెలివరీ డ్రైవర్‌గా చేస్తున్నాడు.గతంలో అతను గ్యాస్ స్టేషన్ నుంచి లాటరీ టికెట్ కొని తన ట్రక్ సీటుపై ఉంచాడు.

దాని గురించి పూర్తిగా మర్చిపోయాడు.అలా చాలా వారాలు గడిచిపోయింది.

చివరికి ఒకరోజు మళ్ళీ టిక్కెట్టు కనిపెట్టి స్క్రాచ్ చేశాడు.అప్పుడు అతడు 100,000 డాలర్లు (రూ.

83,04,000) గెలుచుకున్నట్లు తెలిసి షాక్ అయ్యాడు.ఈ విషయం తెలుసుకున్నాక తన ఆనందానికి అవధులు లేకుండా పోయాయని సదరు వ్యక్తి వర్జీనియా లాటరీకి చెప్పాడు.

"""/" / తన డెలివరీ వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవడానికి డబ్బును వినియోగిస్తానని పేర్కొన్నాడు.

ఒక్కోసారి ఓ మూలన దాచినవే జీవితాన్ని మార్చగలరని, ఏమీ ఆశించక పోయినా దేవుడు కరుణ చూపితే ధనవంతులం కావచ్చు అని అతను అన్నాడు.

అతను కొన్న లాటరీ టికెట్ పేరు Ca$h కార్నర్స్ క్రాస్‌వర్డ్( Ca$h Corners Crossword ) ఈ గేమ్‌లో టాప్ ప్రైజ్ గెలవడం చాలా కష్టం.

1,224,000 టిక్కెట్లలో ఒకటి మాత్రమే $100,000 గెలుచుకోగలదని లాటరీ పేర్కొంది.ఇకపోతే ఈ నెల ప్రారంభంలో, మసాచుసెట్స్‌లోని వ్యక్తులకు కూడా అనుకోకుండా లాటరీ తగిలింది.

ఒకే స్క్రాచ్-ఆఫ్ గేమ్ నుంచి ఇద్దరు వ్యక్తులు ఒక్కొక్కరు $1 మిలియన్ గెలుచుకున్నారు.

వారు ఒకరికొకరు 30 నిమిషాల వ్యవధిలో తమ బహుమతులను క్లెయిమ్ చేసుకున్నారు.

సిక్కు ఎన్జీవో సంస్ధ పెద్ద మనసు .. అమెరికా వ్యాప్తంగా ఏకంగా 10 వేల మందికి భోజనం