కూతుర్ని పైలట్‌ను చేసిన తండ్రి.. ఆయన కూడా పైలటే.. ఆమె ఫ్లైట్‌లోనే రిటైర్డ్!
TeluguStop.com
తాజాగా అమెరికన్ ఎయిర్‌లైన్స్( American Airlines ) విమానంలో ఒక ఎమోషనల్ ఇన్సిడెంట్ చోటుచేసుకుంది.
ఈ సంస్థలో ఒక పైలెట్టు చాలా ఏళ్లుగా పనిచేస్తున్నారు.ఆయన తన కెరీర్‌కు గుడ్ బై చెప్పాలనుకున్నారు.
సదరు పైలట్( Pilot ) తన చివరి విమానాన్ని తన కూతురితో కలిసి నడిపారు.
ఆమె కూడా పైలటే.కూతురు కో-పైలట్‌గా( Co-Pilot Daughter ) ఉన్న ఈ విమాన ప్రయాణం చాలా ప్రత్యేకంగా మారింది.
ఈ హార్ట్ టచింగ్ మూమెంట్స్‌ను కెమెరాలో రికార్డ్ చేశారు.మయామికి ఈ ఏరోప్లేన్ ని నడిపారు.
ఆయన రిటైర్మెంట్( Retirement ) ప్రకటిస్తున్న ఇన్‌స్టాగ్రామ్ వీడియో వైరల్‌గా మారింది.లక్షలాది మంది ప్రజల హృదయాలను తాకింది.
ఆ పైలట్ అమెరికన్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్‌లో ప్రయాణిస్తున్న ప్రయాణికులందరికీ ఒక ఎమోషనల్ ప్రసంగం చేశారు.
"ఇది నా అమెరికన్ ఎయిర్‌లైన్స్‌లోని చివరి రోజు.32 ఏళ్లు, 11,835 రోజులు ఈ సంస్థకు సేవ చేశాను" అని ఆయన గర్వంగా, భావోద్వేగంతో ప్రకటించారు.
ఆయన మాటలకు ప్రయాణికులందరూ చప్పట్లు కొట్టి ప్రోత్సహించారు.ఈ విమానంలో ఆయన కుటుంబ సభ్యులు, స్నేహితులు కూడా ఉన్నారు.
ఆ తర్వాత ఆయన చిన్నగా నవ్వుతూ, "అందరూ కొంచెం ఉత్సాహంగా ఉన్నారు కదా! కానీ మనం సరదాగా మయామికి వెళ్దాం" అని అన్నారు.
"""/" /
ఆ తర్వాత పైలట్ తన కూతుర్ని ప్రవేశపెట్టారు."నా కూతురు నా కో-పైలట్‌గా ఉండటం నా అదృష్టం" అని ఆయన గర్వంగా చెప్పారు.
ఈ వీడియోను '@Aviation For Aviators' అనే ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పోస్ట్ చేయగా, దానికి ఇప్పటికే 9 లక్షల దాకా వ్యూస్ వచ్చాయి.
తండ్రి-కూతురి మధ్య ఉన్న అద్భుతమైన బంధాన్ని ప్రజలు ప్రశంసించారు.పైలట్ కెరీర్‌లో మరో మైలురాయిని చేరుకోవడంపై అందరూ ఆనందించారు.
"""/" /
ఈ వీడియో చూసిన చాలామంది ఈ సందర్భాన్ని చాలా ప్రత్యేకంగా భావించారు.
"ఒక కెరీర్‌ను ఇలా ముగించడం చాలా అందంగా ఉంది." అని ఒకరు కామెంట్ చేశారు.
"అభినందనలు! మీ కష్టం, త్యాగాలను మేం ఎంతగానో అభినందిస్తున్నాము.మీ కుటుంబం మీ పట్ల ఎంతో గర్విస్తుంది" అని మరొకరు రాశారు.
చాలామంది ఈ క్షణాన్ని చాలా అందంగా భావించి, పైలట్‌కు మంచి రిటైర్‌మెంట్ లైఫ్ కోరుకున్నారు.
అబ్బా.. పచ్చిమిర్చి కట్ చేయడానికి పెద్ద ప్లానే వేసిందిగా (వీడియో)