తృటిలో పెనుప్రమాదం.. విమాన రెక్కలపైకి చేరుకున్న ప్రయాణికులు
TeluguStop.com
అమెరికాలోని డెన్వర్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో( Denver International Airport ) గురువారం జరిగిన విమాన ప్రమాదం తృటిలో పెనుప్రమాదం తప్పింది.
ఈ ఘటనలో ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడటంతో పెను విషాదం తప్పింది.కొలరాడో స్ప్రింగ్స్ ఎయిర్ పోర్టు నుంచి డాలస్ ఫోర్ట్ వర్త్‌కు బయల్దేరిన అమెరికన్ ఎయిర్‌లైన్స్‌కు( American Airlines ) చెందిన విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో డెన్వర్‌కు మళ్లించారు.
విమానం ల్యాండ్ అయిన వెంటనే ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి.అమెరికా కాలమానం ప్రకారం గురువారం సాయంత్రం 5.
15 గంటలకు ఈ ఘటన చోటు చేసుకుంది.విమానం గేటు వద్ద ల్యాండ్ అయిన కాసేపటికే ఇంజిన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
దీంతో అప్రమత్తమైన సిబ్బంది వెంటనే ఎమర్జెన్సీ ఎగ్జిట్ గేటును తెరిచి ప్రయాణికులను బయటకు పంపించారు.
ప్రయాణికులు విమానం రెక్కలపై నడుచుకుంటూ బయటకు వచ్చిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాకపోవడం ఊరట కలిగించే విషయం. """/" /
ఇంజిన్‌లో వైబ్రేషన్‌లు రావడంతో విమానాన్ని అత్యవసరంగా డెన్వర్ ఎయిర్ పోర్టుకు మళ్లించి ల్యాండింగ్ చేశారు.
విమానం ల్యాండ్ అయిన వెంటనే ఇంజిన్‌లో మంటలు వ్యాపించాయి.దట్టమైన పొగలు కమ్ముకున్నాయి.
విమానంలో 172 మంది ప్రయాణికులతో పాటు ఆరుగురు సిబ్బంది ఉన్నట్లు అమెరికన్ ఎయిర్‌లైన్స్ ప్రకటించింది.
వెంటనే అప్రమత్తమైన విమాన సిబ్బంది ఎమర్జెన్సీ ఎగ్జిట్‌ను తెరిచి, ప్రయాణికులను సురక్షితంగా విమానం వెలుపలికి దింపారు.
ఇందుకోసం ఇన్‌ఫ్లేటబుల్ స్లైడ్స్ (జారుడు మెట్లు) ఉపయోగించారు. """/" /
అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు కొన్ని గంటలపాటు శ్రమించారు.
ఈ ఘటనపై అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ఏఏ) దర్యాప్తును ప్రారంభించింది.ప్రమాదానికి గల కారణాలను విశ్లేషించేందుకు అధికారులు అన్ని కోణాల్లోనూ విచారణ చేపట్టారు.
ప్రయాణికుల భద్రతకు సంబంధించి మరింత జాగ్రత్తలు తీసుకోవాలని విమానయాన సంస్థలు నిర్ణయించుకున్నాయి.ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్( Viral Video ) అయ్యాయి.
వీడియోల్లో విమానం రెక్కలపై ప్రయాణికులు నడుచుకుంటూ ఒకచోటకు చేరుకుంటున్న దృశ్యాలు కనబడుతున్నాయి.కొంతమంది ప్రయాణికులు చేతిలో బ్యాగులు పట్టుకుని ఉన్నారు.
విమానం కింద మంటలు అంటుకున్న దృశ్యాలు కూడా కనిపించాయి.ఈ ఘటన ద్వారా విమాన ప్రయాణాల్లో భద్రతకు ఎంత ప్రాముఖ్యత ఉందో మరోసారి వెల్లడైంది.
అమెరికాలో ఏపీ విద్యార్ధిపై కాల్పులు.. బాధిత కుటుంబానికి అండగా నిలిచిన ఎమ్మెల్యే