ఉద్యోగమో రామచంద్రా: అమెరికాలో పెరుగుతున్న నిరుద్యోగం, 39 మిలియన్ల మంది ఉద్యోగాలు కట్

కరోనా వైరస్ ధాటికి అమెరికా చిగురుటాకులా వణుకుతోంది.ఆర్ధికంగా, సామాజికంగా అన్ని రకాలుగా నష్టాలను చవిచూస్తూ.

ఈ మహమ్మారి పీడ ఎప్పుడు వదులుతుందా అని సగటు అమెరికన్లు ఎదురుచూస్తున్నారు.అయితే ఆర్ధిక రంగం కుదేలవ్వడంతో లక్షలాది మంది అమెరికన్లు ఉద్యోగాలను కోల్పోతున్నారు.

అన్ని రాష్ట్రాలు లాక్‌డౌన్‌ను ఎత్తివేసినప్పటికీ నిరుద్యోగుల సంఖ్య మాత్రం తగ్గడం లేదు.ఇప్పటికే ఎన్నో సంస్థలు ఖర్చులను తగ్గించుకునేందుకు గాను తమ ఉద్యోగులను తొలగిస్తున్నాయి.

గత వారం 2.4 మిలియన్ల మంది నిరుద్యోగులుగా దరఖాస్తు చేసుకున్న కార్మిక శాఖ ప్రకటించింది.

దీంతో దేశంలో దరఖాస్తుల సంఖ్య 38.6 మిలియన్లకు చేరింది.

"""/"/ మరోవైపు వాణిజ్య సంస్థలు ఇంకా నష్టాలనే చవిచూస్తుండటంతో ఉద్యోగుల మెడపై కత్తి వేలాడుతోంది.

అయితే ఏడువారాలుగా దరఖాస్తుల సంఖ్య క్రమంగా తగ్గుతున్నా.గణాంకాలు మాత్రం ఆందోళన కలిగిస్తున్నాయని ఓ వాణిజ్య రంగ నిపుణుడు పేర్కొన్నారు.

రానున్న రోజుల్లో అమెరికాలో నిరుద్యోగ శాతం 20 నుంచి 25కు పెరిగే అవకాశముందని ఫెడరల్ రిజర్వ్ ఛైర్మన్ జెరోమ్ పావెల్ అభిప్రాయపడ్డారు.

కాగా అమెరికాలో ఇప్పటి వరకు 16 లక్షల మంది కోవిడ్ 19 బారినపడగా, 95 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.

4 కోట్లతో నిర్మిస్తే 30 కోట్ల కలెక్షన్లు.. బన్నీ కెరీర్ లో ఈ సినిమా ఎంత స్పెషల్ తెలుసా?