భారత్ కు మద్దతుగా…చైనాకి అమెరికా స్ట్రాంగ్ వార్నింగ్..!!

అమెరికా అధ్యక్షుడిగా బిడెన్ ఎన్నికైతే భారత్ పై ఎలాంటి ప్రభావం ఉంటుంది, చైనా, పాకిస్తాన్ లకు అనుకూలంగా గతంలో వ్యవహరించిన బిడెన్ భారత్ తో ఎలాంటి సంభంధాలు నెరపుతాడు, భారత్ పై చైనా, పాకిస్తాన్ చేపడుతున్న దుందుడుకు చర్యలని ఖండిస్తారా లాంటి అనుమానాలు ప్రతీ ఒక్క భారతీయుడి మదిలో మెదిలాయి.

అయితే ఆ అనుమానాలు అన్నిటిని పటాపంచలు చేస్తూ భారత్ కు అమెరికా గత ప్రభుత్వం కంటే కూడా మంచి మిత్ర దేశంగా ఉంటుందని, ఎలాంటి సంధర్భంలో నైనా భారత్ కు తోడుగా ఉంటుందని ఈ మధ్య కాలంలో డెమోక్రటిక్ పార్టీ నేతల నుంచి భరోసా నిచ్చే వ్యాఖ్యలు మనకు వినపడుతున్నాయి.

తాజాగా అమెరికాలో స్థిరపడి అక్కడి రాజకీయాలలో దూసుకుపోతున్న అక్కడి చట్టసభల సభ్యుడు రాజా కృష్ణ మూర్తి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేయడంతో పాటు మన కమలా హరీస్, బిడెన్ లు భారత్ కు పూర్తి మద్దతు ఇస్తున్నారని తెలిపారు.

అంతేకాదు చైనా కు స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చేసారు.భారత్ సరిహద్దులో లాడఖ్ ప్రాంతంలో చైనా అక్రమంగా నిర్మాణాలు చేపడుతోందని మా దృష్టికి వచ్చింది.

ఇది నిజమే అయితే ఖచ్చితంగా చైనా ఇండియాను రెచ్చగోట్టినట్టే అలాంటి సమయంలో మేము చైనాను ఆగడాలను ఏ మాత్రం సహించం, ఇదే మాదిరిగా దక్షిణ చైనా సముద్రంలోనూ ఇలాంటి నిర్మాణాలు చేపడుతోంది మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని అన్నారు.

"""/"/ ఇలాంటి పరిస్థితులలో భారత్ కు అమెరికా మద్దతు ఇస్తుందని, అమెరికా తప్పకుండా భారత్ వైపునే నిలబడుతుందని స్పష్టం చేశారు.

బిడెన్ ఎంతో కాలంగా భారత్ కు మంచి మిత్రుడిగా ఉన్నారని, బిడెన్ తో పాటుగా భారతీయ మహిళగా ఉన్న ఉపాధ్యక్షురాలు కమలా హరీస్ కూడా భారత్ కే మద్దతు ఇస్తారని అన్నారు.

ఇప్పటివరకూ అమెరికాకు అధ్యక్ష హోదాలలో ఉన్న ఇరు పార్టీలు భారత్ వైపే ఉన్నాయన్న విషయాన్ని కృష్ణ మూర్తి గుర్తు చేశారు.

కేవలం భారత్ కు మాత్రమే కాదు, చైనా ఏ పోరుగుదేశం తో వాదానికి దిగినా ఆయా దేశాలకు అమెరికా మద్దతు ఉంటుందని ప్రకటించారు.

కృష్ణ మూర్తి ప్రకటనతో భారత్ – అమెరికా ల మధ్య సంభందాల విషయంలో నెలకొన్న అనిశ్చితికి బ్రేక్ పడినట్టే అంటున్నారు నిపుణులు.

వావ్, ఏపీలో 139,000 ఏళ్ల నాటి పురాతన రాతి పనిముట్లు లభ్యం..?