చైనా తో యుద్దానికి మళ్లీ సై అంటున్న అమెరికా

అగ్రరాజ్యం అమెరికా,డ్రాగన్ దేశం చైనా ల మధ్య వాణిజ్య యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే.

అయితే ఇరు దేశాల మధ్య చర్చల ద్వారా ఇటీవల ఈ వాణిజ్య యుద్దానికి తెరపడింది అని భావించారు.

అయితే ఈ చర్చలు మందగించడం తో అగ్రరాజ్యం అమెరికా మరోసారి చైనా పై వాణిజ్య యుద్దానికి తెర తీసింది.

ఈ నేపథ్యంలో దాదాపు 200 బిలియన్ డాలర్ల విలువైన వస్తువుల పై 25 శాతం పన్ను విధిస్తున్నట్లు తాజాగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు.

దీనితో మరోసారి డ్రాగన్ దేశం తో వాణిజ్య యుద్దానికి తెర తీసినట్లు తెలుస్తుంది.

ఈ సుంకాలు మే 10 నుంచి అమల్లోకి రానున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు.గత 10 నెలల నుంచి డ్రాగన్ దేశం 50 బిలియన్ డాలర్ల వస్తువుల పై 10 శాతం సుంకాన్ని అమెరికా చెల్లిస్తూ వస్తుంది.

అయితే ఇప్పుడు తాజాగా ఆ 10 శాతం సుంకం విధింపు ఇప్పుడు 25 శాతం కి పెంచుతూ మరోసారి వాణిజ్య యుద్దానికి తెర లేపింది.

చైనా, అమెరికాల మధ్య ముదిరిన వాణిజ్య యుద్ధానికి పరిష్కార మార్గం కనుగొనేందుకు గత ఏడాది నవంబర్ లో జీ-20 సమావేశం లో దేశాధినేతలు ఒక నిర్ణయానికి వచ్చిన సంగతి తెలిసిందే.

100 రోజులు ఇరు దేశాల సుంకాలు పెంచకూడదంటూ ఈ సమావేశంలో నిర్ణయించుకున్నాయి.అయితే ఈ మార్చి నెలతో ముగియడం తో ఆ గడువును మరి కొంత కాలం పొడిగించగా ఇప్పుడు తాజాగా అధ్యక్షుడు ట్రంప్ పై మేరకు నిర్ణయం తీసుకున్నారు.

అయితే దీనిపై దేశం చైనా స్పందించలేదు.సమగ్ర వాణిజ్య ఒప్పందానికి సంబంధించి చైనా ఉన్నతాధికారులతో బుధవారం వాషింగ్టన్ లో సమావేశం నిర్వహించనున్నారు.

అయితే ఈ సమావేశంలో ట్రంప్ తీసుకున్న నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది.

బీఆర్ఎస్ నేత క్రిశాంక్ అరెస్ట్