అమెరికా అధ్యక్ష ఎన్నికలు: సిక్కులు ఎవరి పక్షం..?

అమెరికా అధ్యక్ష ఎన్నికలకు పట్టుమని వారం రోజులు కూడా గడువు లేదు.దీంతో ఇరు వర్గాలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి.

అటు అభ్యర్ధుల గెలుపుఓటములు, వివిధ వర్గాల మద్ధతుకు సంబంధించి రోజుకొక సర్వే బయటకు వస్తోంది.

అమెరికా ఎన్నికల్లో డిసైడింగ్ ఫ్యాక్టర్ భారతీయులే.కీలక రాష్ట్రాల్లో స్థిరపడిన భారతీయ సమాజం ఫలితాలను తారుమారు చేయగలిగిన శక్తిమంతులు.

అమెరికాలో స్థిరపడిన భారతీయుల్లో అత్యధికులు పంజాబీలు, సిక్కులే.ప్రస్తుతం వీరి మద్ధతు ఎవరికి లభిస్తుందన్న దానిపై అగ్రరాజ్యంలో జోరుగా చర్చ నడుస్తోంది.

అయితే సిక్కులు తాజా ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధి డొనాల్డ్ ట్రంప్ వైపే మొగ్గుచూపుతున్నట్లుగా తెలుస్తోంది.

ఇందుకు కారణం లేకపోలేదు.అక్కడ చిన్న చిన్న వ్యాపారాలు, భారత్- అమెరికా ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడానికి ట్రంప్ కృషి చేస్తున్నారని సిక్కు నేతలు చెబుతున్నారు.

అందువల్ల ఎన్నికల్లో ట్రంపే గెలవాలని వారు కోరుకుంటున్నారు.హోరాహోరీ పోరు ఉండే మిచిగాన్, విస్కాన్సిన్, ఫ్లోరిడా, పెన్సిల్వేనియా రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో గణనీయమైన సంఖ్యలో సిక్కులు ఉన్నారు.

వీరందరూ ఇప్పుడు అధ్యక్షుడు ట్రంప్‌వైపే మొగ్గుచూపుతున్నారని విస్కాన్సిన్‌లోని మిల్వాకీ ప్రాంతానికి చెందిన ప్రముఖ సిక్కు నాయకుడు, వ్యాపారవేత్త దర్శన్ సింగ్ ధలివాల్ అన్నారు.

"""/"/ ప్రధాని నరేంద్ర మోదీతో ట్రంప్ స్నేహ సంబంధాలు వంటి విషయాలను దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాంతంలో సిక్కులు ఆయనకే మద్ధతు ఇస్తున్నారని దర్శన్ చెప్పారు.

కమలా హారిస్, జో బిడెన్, డెమొక్రాట్ల గురించి మాట్లాడిన ఆయన.కమల భారత సంతతికి చెందిన వ్యక్తే అయినప్పటికీ ఇండియాకు వ్యతిరేకమని వ్యాఖ్యానించారు.

కానీ ట్రంప్ పూర్తిగా భారత్‌కు మద్ధతుగా వున్నారని ధలివాల్ చెప్పారు.ఒకవేళ ట్రంప్ కనుక రెండో సారి అధ్యక్షుడిగా ఎన్నిక కాకపోతే చైనా తమను తీవ్రంగా ఇబ్బంది పెడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

కాగా, మనదేశంలోని పంజాబ్, రాజస్థాన్, హర్యానా తదితర ప్రాంతాల్లోని సిక్కులు స్వాతంత్య్రానికి పూర్వమే అమెరికాకు వలస వచ్చారు.

అనధికార లెక్కల ప్రకారం అక్కడ సిక్కు జనాభాకు 5 లక్షల పైమాటే.

ప్రతి సినిమాలో చిరంజీవి చేస్తున్న మిస్టేక్స్ ఇవేనా..?