“ఎన్నారై ఫ్యామిలీ” కి కరోనా అండగా నిలిచిన…“సేవా స్వచ్చంధ సంస్థ”

అగ్ర రాజ్యమైన అమెరికాలో కరోనా కోరలు చాస్తోంది.చైనా కరోనా విషయం ప్రపంచానికి తెలియకుండా దాచి ఒక తప్పు చేస్తే.

కరోనా వ్యాప్తి దేశాలకి పాకుంతోందని, దాని ప్రభావం తీవ్రంగా ఉంటుందని తెలిసిన అమెరికా అధ్యక్షుడు నిర్లక్ష్యం చేసి మరొక తప్పు చేశారు.

ఫలితంగా అమెరికా వ్యాప్తంగా కరోనా పంజా విసురుతోంది.కేవలం ఒక్క న్యూయార్క్ సిటీలోనే వేలాది మంది మృతి చెందగా అమెరికా వ్యాప్తంగా 4 వేల పై చీలుకు మరణాలు నమోదు అయ్యాయి.

2 లక్షలకి పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా అమెరికా ప్రస్తుత పరిస్థితి తో ఉక్కిరి బిక్కిరి అవుతోంది.

ఈ క్రమంలోనే అమెరికాలో అత్యధిక శాతం ఉంటున్న భారత వలసవాసులు కొందరికి కరోనా ఎటాక్ అయ్యింది.

అమెరికాలోని హ్యూస్టన్ నగరంలో ఉంటున్న ఎన్నారై రోహన్ బవదేకర్ కరోనా బారిన పడ్డారు.

అతడి భార్య, ముగ్గురు పిల్లలకి సైతం కరోనా సోకింది.కరోనా ప్రభావం రోహన్ పై ఎక్కువగా చూపడంతో అతడికి డాక్టర్ లు వెంటిలేటర్ ఉపయోగించి వైద్య చికిత్స లు అందిస్తున్నారు.

ఈ నేపధ్యంలో అమెరికాలో ఉంటున్న సేవా ఇంటర్నేషనల్ స్వచ్చంద సంస్థ ఎన్నారై కుటుంభానికి బాసటగా నిలిచింది.

ఈ స్వచ్చంద సేవ సంస్థకి చెందిన సభ్యులు రోహన్ కుటుంభానికి మౌలిక సదుపాయాలు, మెడిసిన్ సదుపాయాలూ అందిస్తున్నారు.

ఎలాంటి అవసరమైనా తమని సంప్రదించమని రోహన్ కుటుంభ సభ్యులకి భరోసా ఇచ్చారు.రోహన్ ఆరోగ్య పరిస్థితులపై వైద్యులని సంప్రదిస్తూ మెరుగైన వైద్యం అందేలా చేస్తున్నారు.

నేటి ఎన్నికల ప్రచారం: నిజామాబాద్ జిల్లాలో కేసీఆర్ .. రేవంత్ రెడ్డి ఎక్కడెక్కడ అంటే ?