అమెరికాలో యువకుడి బీభత్సం..నలుగురు మృతి..!!!

అమెరికాలోని లాస్ఏంజిల్స్ లో దారుణం చోటుచేసుకుంది.ఒక్క సారిగా ఊహించని విధంగా ఓ దుండగుడు ఓ మార్ట్ లోకి వచ్చి విచక్షణా రహితంగా కత్తితో గాయపరిచి సుమారు నలుగురి మృతికి కారణం అయ్యాడు.

అంతేకాదు పలువురుని గాయపరిచి చివరికి పోలీసుల చేతికి చిక్కాడు.ఈ ఘటన మాన్ గ్రోవ్ సిటీలో ఓ మార్ట్ లో జరిగింది.

వివరాలలోకి వెళ్తే. """/"/ మాన్ గ్రోవ్ సిటీలోని ఓ సూపర్ మార్ట్ లోకి ఒక్క సారిగా వచ్చిన దుండగుడు అక్కడ క్యాష్ కౌంటర్ లో ఉన్న వ్యక్తికి కత్తి చూపించి అందులోని సొమ్ముని కాజేశాడు.

ఆ మార్ట్ బయట ఉన్న సెక్యూరిటీ వద్దకి వెళ్లి అతడిని కత్తితో పొడిచి చంపి అతని వద్దనున్న గన్ తీసుకుని పారిపోయాడు.

ఇలా ఆ దుండగుడు పలు దుకాణాలలో బెదిరింపులకి దిగుతూ హత్యలు చేస్తూ అందిన కాడికి దోచుకుని వెళ్ళిపోయాడు.

"""/"/ పోలీసులు అందుకున్న సమాచారం మేరకు అతడి కోసం గాలించగా ఓ మార్ట్ బయట నుంచీ లోపలి వెళ్తున్న అతడిని చుట్టుముట్టి అతడి నుంచీ కత్తి, గన్ తీసుకుని అరెస్ట్ చేశారు.

సంచారం అందిన వెంటనే పోలీసులు రావడంతో ప్రమాదం భారీ స్థాయిలో జరగలేదని, లేకపోతే అతడు మరింతమందిని బలి తీసుకునే వాడని అంటున్నారు పోలీసులు.

అతడిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభిచినట్లుగా స్థానిక మీడియా తెలిపింది.

పెన్షన్ల విషయంలో చంద్రబాబు రాజకీయం..: సీఎం జగన్