అమెరికా “గోల్డెన్ స్టేట్ కిల్లర్” ట్రాక్ రికార్డ్ వింటే మైండ్ బ్లాకే..

అమెరికాలో ఓ సీరియ కిల్లర్ జీవిత గాధ వింటే ఒక్క క్షణం షాక్ అవ్వాల్సిందే.

74 ఏళ్ళ ఈ జోసెఫ్ జేమ్స్ అనే ఈ మాజీ పోలీసు అధికారి.

దాదాపు 13 హత్యలు, 50 హత్యాచారాలు, వందల సంఖ్యలో లూటీలు, దొంగతనాలు ఇలా అతడి ట్రాక్ రికార్డ్ వింటే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే.

అందుకే కాబోలు అతడి నేరాల చిట్టా చదువుతూ న్యాయమూర్తి షాక్ అయిపోయారు.అతగాడి నేర చరిత్ర ఒక్కసారి పరిశీలిస్తే.

అందులో వెలుగు చూసిన కొన్ని సంఘటనలు మీకు అతడిపై తీవ్ర ఆగ్రహాన్ని కలిగించక మానదు.

గోల్డెన్ స్టేట్ కిల్లర్ గా అందరిని హడలెత్తించిన ఈ నేరగాడిని దాదాపు మూడు దశాబ్దాలు తరువాత అరెస్ట్ చేశారు.

వరుస నేరాలు జరుగుతున్న క్రమంలో అక్కడ దొరికిన డీఎన్ఏ లని నిందితుడు జోసెఫ్ డీఎన్ఏ ను పోల్చి చూసిన అధికారులు షాక్ అయ్యారు.

దాదాపు 50 హత్యాచారాలు ఇతడే చేయడం అందులో సుమారు 15 మందిని చంపేశాడని ద్రువీకరిచారు.

అయితే అతడిని పట్టుకుని కోర్టులో హాజరుపరిచిన క్రమంలో అతడు కేవలం మూడే మూడు మాటలు చెప్పారు.

అవును నేను తప్పు చేశాను.అయితే ఈ తప్పుని ఒప్పుకోవడం లో కూడా ఓ లాజిక్ ఉంది.

అదేంటంటే. """/"/ అతడికి మరణ శిక్ష కాకుండా జీవిత ఖైదు విధిస్తేనే తప్పులని న్యాయమూర్తి ముందు ఒప్పుకుంటానని ఒప్పందం కుదరడంతో ఈ తప్పులని తానె చేసినట్టుగా ఒప్పుకున్నాడని మీడియా తెలిపింది.

ఒంటరిగా ఉన్న మహిళలని టార్గెట్ చేస్తూ వారిని అత్యాచారం చేయడం వారిని లొంగ దీసుకోవడానికి ఇళ్ళలో ఉన్న వారి పిల్లలని చంపేస్తానని బెదిరించడం వంటి పనులు చేసేవాడని, అలాగే ఓ బలమైన వస్తువుతో మహిళల తలపై బలంగా కొట్టి చంపేసేవాడని విచారణలో తెలిసింది.

ఓ 18 ఏళ్ళ యువతిపై చివరి సారిగా అత్యాచారం చేసిన కేసులో ఇతడు దొరికాడని, అదే ఇతడి చివరి నేరమని పోలీసులు తెలిపారు.

అతడు చేసిన నేరాల చిట్టా విన్న న్యాయమూర్తి తీర్పు చెప్తూ ఇలాంటి భాదితులకి ఇన్నేళ్ళ తరువాత న్యాయం జరగడం ఎంతో బాధాకరమైన విషయమని ఆవేదన చెందారు.

తేజ సజ్జా జై హనుమాన్ సినిమాలో ఉంటాడా..?