అమెరికా : ‘‘కాస్తుంటే నా కాలు తినేసేది’’.. షార్క్ నుంచి తృటిలో తప్పించుకున్న యువకుడు
TeluguStop.com
అమెరికన్లను షార్క్‌ల భయం వెంటాడుతోంది.బీచ్‌లలో సరదాగా కుటుంబంతో కలిసి ఆడుకుందామంటే ఏ వైపు నుంచి ఏ తిమింగలం వచ్చి దాడి చేస్తుందోనని వారు భయపడుతున్నారు.
న్యూయార్క్, ఫ్లోరిడా బీచ్‌లలో( New York And Florida ) రోజుల వ్యవధిలో షార్క్ దాడి చేసిన ఘటనలు చోటు చేసుకోవడంతో ఆ వైపు వెళ్లాలంటేనే ప్రజలు వణికిపోతున్నారు.
ఇటీవల ఫ్లోరిడాకు చెందిన ఓ కళాశాల విద్యార్ధిపై షార్క్ దాడి చేయగా.తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు.
వెన్నులో వణుకు పుట్టించే ఈ భయంకరమైన అనుభవం గురించి అతను గుర్తుచేసుకున్నాడు.షార్క్ నుంచి అతని మిత్రుడు, మరో సర్ఫర్ బాధితుడిని రక్షించారు.
లేకుంటే అతను తిమింగళానికి ఆహారమయ్యేవాడు.బాధితుడు 21 ఏళ్ల క్రిస్ పోస్పిసిల్( Chris Pospisil ), తన స్నేహితుడు రీస్ రెడిస్ ( Reese Redis )గత వారం న్యూ స్మిర్నా బీచ్‌లో సర్ఫింగ్ చేస్తుండగా.
క్రిస్‌పై షార్క్ దాడి చేసింది.షార్క్ తన బోర్డు కిందగా వచ్చి తనను వెనక్కి లాగిందని, దీంతో తాను సముద్రంలో పడిపోయానని చెప్పారు.
అప్పుడు నా కాలు షార్క్ నోటికి అతి సమీపంలో వుందని క్రిస్ చెప్పాడు.
తాను సహాయం కోసం కేకలు వేయగా.రీస్ గమనించాడని పేర్కొన్నాడు.
వెంటనే తన చొక్కా పట్టుకుని, బోర్డ్ మీదకు లాగాడని క్రిస్ వెల్లడించాడు. """/" /
ఈ ఘటనలో క్రిస్ తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
క్రిస్ వైద్య ఖర్చులు, అతని కుటుంబానికి సహాయం చేయడానికి క్రిస్ కజిన్ యాష్లే GoFundMe పేజీని ప్రారంభించారు.
క్రిస్ పాదాలకు తీవ్రగాయాలయ్యాయని.అతనికి అత్యవసర చికిత్స అవసరమని అందులో పేర్కొన్నారు.
క్రిస్ పాదాల్లో సొరచేప దంతాలు దిగబడ్డాయని పేజీలో వెల్లడించారు. """/" /
ఇకపోతే.
లాంగ్ ఐలాండ్( Long Island ) సమీపంలో భయంకరమైన షార్క్‌లను , వాటి దాడులను పసిగట్టేందుకు న్యూయార్క్ రాష్ట్ర అధికారులు తీరం వెంబడి షార్క్ మానిటరింగ్ డ్రోన్‌లను మోహరిస్తున్నారు.
గడిచిన రెండు రోజుల్లోనే ఐదు షార్క్ దాడులు నమోదైన నేపథ్యంలో అధికార యంత్రాంగం ఈ నిర్ణయం తీసుకుంది.
ఈ వేటాడే జంతువులను ఎగువ నుంచి ట్రాక్ చేయడానికి న్యూయార్క్ రాష్ట్ర ప్రభుత్వం తన ప్రయత్నాలను మరింత వేగవంతం చేస్తోంది.
బ్యాటరీతో నడిచే డ్రోన్‌లను లాంగ్ ఐలాండ్, న్యూయార్క్‌లోని బీచ్ కమ్యూనిటీల చుట్టూ మోహరిస్తున్నారు.
‘‘ Shark Surveillance Program’’ కింద బీచ్‌ల వద్ద రక్షణ చర్యలను కట్టుదిట్టం చేయనుంది.
వైఫ్‌కి తెలియకుండా నలుగురు గర్ల్‌ఫ్రెండ్స్‌ని మెయింటైన్ చేస్తున్న చైనీస్ వ్యక్తి… చివరికి..?