తొక్కి పడేస్తాం..ట్రంప్ సంచలన వ్యాఖ్యలు..!!

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరో సారి రెచ్చిపోయారు.అమెరికా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని వేదికపై మాట్లాడిన ట్రంప్ ఎంతో ఉద్వేగ పూరితమైన ప్రసంగం చేశారు.

వైట్ హౌస్ లాన్ లో ఏర్పాటు చేసిన భారీ సభలో ట్రంప్ అమెరికా ఖ్యాతి గురించి, అమెరికా ప్రపంచానికి ఎంత ఆదర్శంగా నిలుస్తోంది అనే విషయాలని వెల్లడిస్తూనే రాజకీయంగా తనపై కక్ష సాధించాలనుకునే వారిపై తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు.

అమెరికాలో గడిచిన కొన్ని రోజులుగా నిరసనలు తెలిపుతూ అలజడి సృష్టిస్తున్న నిరసన కారులపై ట్రంప్ కోపంతో ఊగిపోతూ మాట్లాడారు.

అమెరికాలో అరాచక వాదులు, దోపిడీ దారుల ఆగడాలని సహించబోనని, అలాంటి వేషాలు వేసేవారిని ఉక్కు పాదంతో అణిచివేస్థానాని ప్రకటించారు.

మన దేశంలో విగ్రహాలు కూల్చేస్తూ చారిత్రాత్మక సంపదని నాశనం చేస్తూ అసలు అమెరికాకి జీవం పోసిన మహనీయులకి అవమానాలు కలిగించే దోపిడీ దారులని ఎట్టిపరిస్థితుల్లోనూ క్షమించనని అన్నారు.

"""/"/ అమెరికా చరిత్రని తుడిచి పెట్టడానికే ఎంతో మంది యోధులకి అవమానం కలిగించడానికే నిరసన కారులు పూనుకున్నారని, ఈ పరిస్థితులని కలిగిస్తోంది వామపక్షాలు దారుణమైన ఆలోచనేనని మండిపడ్డారు.

అమెరికా చరిత్రని భావి తరాలకి తెలియకుండా చేయడానికే వెళ్ళు కంకణం కట్టుకున్నారని వీరిపై కటినమైన చర్యలు తీసుకోకపోతే మరింత దూకుడు ప్రదర్శిస్తారని ట్రంప్ ప్రకటించారు.

ఇదిలాఉంటే ఈ మధ్య కాలంలో ట్రంప్ ఇలా భావోద్వేగ పూరితమైన ప్రసంగం చేయలేదని, నిరసన కారులపట్ల ట్రంప్ పూర్తి అసహనంతో ఉన్నారని స్థానిక మీడియా తెలిపింది.

సీఎం జగన్ రేపటి ఎన్నికల షెడ్యూల్ రిలీజ్..!!