అమెరికా : భారతీయ విద్యార్ధులు అత్యధికంగా చేరుతున్న కోర్సు ఏంటో తెలుసా ..!!!

భారత్ నుంచి విదేశాలకు ఎంతోమంది విద్యార్థులు అమెరికాకు ఉన్నత చదువుల కోసం వలస వెళ్తున్నారు.

అమెరికా వెళ్లి చదువుకోవాలి, అక్కడే మంచి ఉద్యోగం సాధించి శాశ్వతంగా స్థిరపడాలని కలలు కంటుంటారు.

అనుకున్నట్టుగానే మన భారతీయ విద్యార్ధులు మనదైన ప్రతిభతో అక్కడే ఉద్యోగాలు సాధించి స్థిరపడుతున్నారు.

అయితే అత్యధిక శాతం మంది భారతీయ విద్యార్ధులు సక్సెస్ ఫుల్ గా అక్కడ విజయకేతనం ఎగురవేయడానికి కారణం వారు కష్టపడి చదవడం ఒకటైతే వారు ఎంచుకుంటున్న కోర్సులు మరొక కారణం.

అమెరికాలో మన భారతీయ విద్యార్ధులు ఐదో వంతుకు పైగా కంప్యూటర్ సైన్స్ కోర్సుల్లోనే చేరుతున్నారట.

ప్రస్తుతం అమెరికాలో ఉద్యోగం సాధించాలంటే ఈ కోర్సు చేయడమే మంచిదని అంటున్నారు నిపుణులు సైతం.

దాదాపు 37 శాతం మంది భారతీయ విద్యార్ధులు ఈ కంప్యూటర్ కోర్సులలోనే చేరుతున్నారట.

ఇంటర్ నేషనల్ ఇన్స్తిటూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ విడుదల చేసిన తాజా సర్వేలో ఈ విషయం వెల్లడయ్యింది.

ఈ నివేదిక ప్రకారం… """/"/ 2021 -22 లో అమెరికాకు చదువుకోవాలని వచ్చిన వారి సంఖ్య సుమారు 9.

50 లక్షలు కాగా వీరిలో కంప్యూటర్ సైన్స్ లో చేరిన వారి సంఖ్య 2 లక్షలు, అయితే ఇందులో కేవలం భారత్ నుంచీ వచ్చిన విద్యార్ధులు దాదాపు 73 వేల మంది కంప్యూటర్ సైన్స్ కోర్సులలో చేరారట.

ఈ విషయంలో భారతీయ విద్యార్ధుల హవానే కనిపిస్తోంది.ఇక తరువాత 67 వేల మందితో చైనా రెండవ స్థానంలో ఉంది.

ఇదిలాఉంటే ఇప్పటికే కంప్యూటర్ సైన్స్ పై ఎంతో మంది విద్యార్ధులు ఆసక్తి కనబరుస్తున్నారని భవిష్యత్తుఓ ఈ కోర్సులో చేరే వారి సంఖ్య మరింత మంది పెరగడంతో ఈ కోర్సుకు భారీ డిమాండ్ వస్తుందని ఏర్పడుతుందని అంటున్నారు నిపుణులు.

వైరల్ అవుతున్న ఓరియో బిస్కెట్ వీడియో.. ఆ బిస్కెట్ అంత డేంజరా?