ఐపీఎల్ లో మరో వికెట్ డౌన్.. ఈ సారి అమెరికన్ బౌలర్ వంతు..!
TeluguStop.com
యూఏఈ దేశంలో జరుగుతున్న ఐపీఎల్ 13 వ సీజన్ రసవత్తరంగా సాగుతోంది.పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో నువ్వా నేనా అన్నట్లుగా ప్రతి టీం పోరాడుతోంది.
ఇకపోతే ఇప్పటి వరకు ఐపీఎల్ 13 సీజన్ నుంచి సన్ రైజర్స్ టీమ్ నుంచి భువనేశ్వర్ కుమార్, అలాగే మరో ఆటగాడు అమిత్ మిశ్రా కూడా ఐపీఎల్ నుండి వైదొలిగిన సంగతి మరువక ముందే మరో ఆటగాడు ఐపీఎల్ 13వ సీజన్ నుండి వైదొలిగాడు.
గాయం కారణంగా కేకేఆర్ ఫాస్ట్ బౌలర్ అలీ ఖాన్ ఈ మెగా టోర్నీ నుండి ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండానే దూరమయ్యారని ఐపీఎల్ మేనేజ్మెంట్ అధికారికంగా ప్రకటించింది.
ఇకపోతే అమెరికా దేశ ఆటగాడైన అలీ ఖాన్ తొలిసారిగా ఐపీఎల్ లో ఆడేందుకు చోటు దక్కించుకున్నాడు.
అయితే అలీ ఖాన్ ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండానే ఐపీఎల్ టోర్నీకి దూరమవడంతో ఐపీఎల్ ఫ్యాన్స్ తీవ్రంగా నిరాశ చెందారు.
అలీ ఖాన్ అమెరికా దేశం నుండి తొలిసారిగా ఐపీఎల్ లో చోటు దక్కించుకున్న ఆటగాడు.
ఇకపోతే ఐపీఎల్ సీజన్ మొదలవ్వక ముందు ఇంగ్లాండ్ బౌలర్ హ్యారీ సెలెక్ట్ చేసుకున్న కేకేఆర్ అతడు గాయం కారణంగా వైదొలగడంతో ఆస్థానంలో అలీని ఎంపిక చేసుకుంది.
దీంతో ఐపీఎల్ లో మొట్టమొదటి అమెరికా ఆటగాడు ఆడోబోతున్నట్టుగా ఈయన రికార్డులకెక్కాడు.ఇకపోతే అలీ ఖాన్ పాకిస్తాన్ లో పుట్టి ఆ తర్వాత 18 సంవత్సరాల వయసు ఉన్న సమయంలో వారి కుటుంబంతో కలిసి అమెరికాకు వెళ్లి అక్కడే స్థిరపడ్డాడు.
దీంతో అక్కడ జరిగే లీగ్స్ లో తన ప్రతిభను చాటి చివరికి అమెరికా టీమ్ కు సెలక్ట్ అయ్యాడు.
అంతేకాదు అమెరికా టీం లో ఓ కీలక ఆటగాడిగా ఎదిగాడు కూడా.ఈయన ఇప్పటివరకు కేవలం ఒక అంతర్జాతీయ క్రికెట్ మాత్రమే అయినప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా అనేక T20 లీగ్స్ ఆడిన అనుభవం అతనికి ఉంది.
పాకిస్తాన్ సూపర్ లీగ్, బంగ్లాదేశ్ లీగ్, కెనడా లీగ్, కరీబియన్ ప్రీమియర్ లీగ్ ఇలా ప్రపంచంలోని వివిధ లీగ్స్ లో అతను ఆడి తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు.
మోహన్ బాబు తన కొడుకుల విషయంలో ఎందుకు ఇలా చేస్తున్నాడు…