అమెరికాలో భారతీయ విద్యార్ధికి కరోనా…!!

అమెరికాలో కరోనా మహమ్మారి రోజు రోజుకి తీవ్ర రూపం దాల్చుతోంది.చిన్నా పెద్దా తేడా లేకుండా ఈ మహమ్మారి విలయ తాండవానికి లక్షలాది మంది ప్రజలు ప్రజాలు కోల్పోయారు.

దాదాపు అన్ని దేశాలలో ఇదే పరిస్థితి ఉన్నా అమెరికాలో కారోనా ప్రభావం మాత్రం చాలా తీవ్రంగా ఉందనే చెప్పాలి.

రోజు రోజుకి వేలాది కేసులు నమోదు అవ్వడమే కాకుండా వందలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు.

ఈ పరిస్థితిని అదుపు చేయాలంటే కేవలం లాక్ డౌన్, సామాజిక దూరం వలన మాత్రమే సాధ్యమవుతుందని నిపుణులు చెప్తున్నా ట్రంప్ పెడచెవిన పెడుతూనే వచ్చారు.

ఈ క్రమంలోనే ట్రంప్ ఆదేశాలకు అనుగుణంగా అమెరికాలో కొన్ని చోట్ల విద్యాసంస్థలు ప్రారంభించారు.

దాంతో ఇండియానాలోని గ్రీన్ ఫీల్డ్ సెంట్రల్ జూనియర్ హై స్కూల్ విద్యా సంస్థని జులై 30వ తేదీన ప్రారంభించారు.

అయితే ప్రారంభం అయిన మొదటి రోజునే భారత సంతతికి చెందిన ఓ విద్యార్ధికి కరోనా పాజిటివ్ నమోదు అయ్యిందని తెలుస్తోంది.

ఈ పరిణామలతో ఒక్క సారిగా స్కూల్ భోధన సిబ్బంది, పిల్లలు ఉలిక్కిపడ్డారు.విద్యా సంస్థ మొదలు పెట్టిన కొన్ని గంటల వ్యవధిలోనే హాంకక్ కౌంటీ లోని ఆరోగ్య విభాగానికి చెందిన నిపుణులు ఓ భారతీయ విద్యార్ధికి కరోనా పాజిటివ్ అని తేల్చి చెప్పారు.

ఆరోగ్య విభాగం నుంచీ హెచ్చరికలు అందుకోగానే విద్యా సంస్థ అలెర్ట్ అయ్యింది.హుటాహుటిన పిల్లలని శానిటైజేషన్ చేయించింది.

ప్రత్యేకమైన ప్రోటోకాల్ ప్రకారం పిల్లలని జాగ్రత్తచేసింది.కరోనా సోకినా విద్యార్ధిని పిల్లల నుంచీ వేరుగా చేసి అతడితో చనువుగా ఉన్న వారిని 14 రోజుల పాటు అబ్జర్వేషన్ లో ఉంచింది.

ఈ విషయంపై స్పందించిన స్కూల్ సూపరెండేంట్ కరోనా ప్రభావం గురించి తెలిసినా కేవలం విద్యార్ధుల భవిష్యత్తు దృష్టిలో ఉంచుకుని స్కూల్ తెరించామని ఇలా జరుగుతుందని అనుకోలేదని అన్నారు.

అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసులో నిందితులకు బెయిల్