7 రోజులు....27వేల కేసులు...అమెరికా సిడీసి డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు...!!
TeluguStop.com
అగ్ర రాజ్యం అమెరికాలో కరోనా డెల్టా వేరియంట్ స్థాయి తీవ్రమవుతోందా.? కరోనా మొదటి వేరియంట్ సమయంలో అమెరికా ఎదుర్కున్న గడ్డు పరిస్థితులను థర్డ్ వేవ్ లో కూడా చవి చూడనుందా.
?? లక్షల సంఖ్యలో డెల్టా కేసులు నమోదు అవనున్నాయా అంటే అవుననే అంటున్నారు అమెరికా సిడీసి(సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్) నిపుణులు.
మళ్లీ అమెరికాలో పరిస్థితి చేయి దాటే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు వివరాలలోకి వెళ్తే.
అమెరికాలో కరోనా మొదటి వేవ్ సమయంలో లక్షలాది మంది ప్రాణాలు కోల్పోగా కోట్ల మందికి పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.
అప్పటి ప్రభుత్వం నష్ట నివారణ చర్యలు చేపట్టినా ఫలితం లేకపోయింది.అయితే సెకండ్ వేవ్ సమయానికి బైడన్ ప్రభుత్వం వ్యాక్సిన్ లు అమెరికా ప్రజలకు అందించడంతో పాటు, సామాజిక దూరం పాటించే విషయంలో కటినమైన నిభందనలు విధించడంతో సెకండ్ వేవ్ పెద్దగా ప్రభావాన్ని చూపలేదు.
కానీ. """/"/
అమెరికా ప్రజలు టీకాలు వేయించుకున్న , లేకపోయినా థర్డ్ వేరియంట్ డెల్టా మాత్రం విశ్వరూపం చూపిస్తోందని, లెక్కకు మించిన కేసులు నమోదు అవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు సిడీసి డైరెక్టర్ రోషెల్ వాలెన్స్కీ.
వైట్ హౌస్ లో మీడియా సమావేశంలో మాట్లాడినా ఆమె డెల్టా దడ పుట్టిస్తోంది తెలిపారు.
కేవలం ఒక్క గురువారం రోజున అమెరికా వ్యాప్తంగా 33 వేల కేసులు నమోదు అయ్యాయని, సగటున చూస్తే వారంలో ఒక్కోరోజుకు 27 వేల కేసులు నమోదయ్యాయనిఇది ఆందోళన కలిగించే విషయమని మొదటి వేరియంట్ సమయంలో కేసుల సంఖ్య ఇలానే మొదలయ్యిందని తెలిపారు.
కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికంటే కూడా తీసుకొని వారిపై తీవ్ర ప్రభావం చూపుతోందని అన్నారు.
అయితే డెల్టా అమెరికాపై ఎలాంటి ప్రభావం చూపలేదని అంటువ్యాధుల నిపుణుడు ఫౌచీ ఒకపక్క చెప్తుంటే తాజాగా సిడీసి డైరెక్టర్ చేసిన వ్యాఖ్యలు అమెరికా ప్రజలలో ఆందోళన కలిగిస్తున్నాయి.
మహేష్ సినిమాను చిన్నచూపు చూసిన పవన్ కళ్యాణ్ బ్యూటీ.. చివరకు ఏమైందంటే?