భారతీయుల ప్రతిభతో అమెరికా లబ్ధిపొందుతోంది.. ఎలన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు

భారతీయుల ప్రతిభతో అమెరికా లబ్ధిపొందుతోంది ఎలన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం దశాబ్ధాల క్రితమే అమెరికా గడ్డ మీదకు అడుగుపెట్టిన భారతీయులు క్రమంగా ఇక్కడి సమాజంలో కీలక స్థానాన్ని ఆక్రమించారు.

భారతీయుల ప్రతిభతో అమెరికా లబ్ధిపొందుతోంది ఎలన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు

అన్ని రంగాల్లో దూసుకెళ్తూ స్థానిక అమెరికన్లతో పాటు అగ్రరాజ్యంలో స్ధిరపడిన మిగిలిన విదేశీయులకు పోటీ ఇస్తున్నారు.

భారతీయుల ప్రతిభతో అమెరికా లబ్ధిపొందుతోంది ఎలన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు

ఇక ఎన్నికల్లో భారతీయుల పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.పెన్సిల్వేనియా, జార్జియా, ఫ్లోరిడా, మిచిగాన్, టెక్సాస్‌, నార్త్ కరోలినా తదితర కీలక రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో స్థిరపడిన ఇండో అమెరికన్లు అభ్యర్ధుల విజయాలను శాసిస్తున్నారు.

అందుకే వీరి కరుణ కోసం రిపబ్లికన్లు, డెమొక్రాట్లు తెగ తపిస్తుంటారు.అమెరికా అధ్యక్ష ఎన్నికలు- 2020లో భారతీయుల హవా స్పష్టంగా కనిపించింది.

ఇప్పటికే అమెరికన్ టెక్ దిగ్గజ సంస్థలకు పలువురు భారతీయులు నాయకత్వం వహిస్తున్నారు.సత్యనాదెళ్ల, సుందర్ పిచాయి, అరవింద్ కృష్ణ, ఇంద్రా నూయి వంటివారు విజయవంతంగా కంపెనీలను నడిపిస్తున్నారు.

తాజాగా భారత సంతతికి చెందిన పరాగ్ అగర్వాల్‌.సోషల్ మీడియా దగ్గజం ట్విట్టర్‌కు సీఈవోగా నియమితులవ్వడంతో కార్పోరేట్ ప్రపంచంలో భారతీయుల ఆధిపత్యం మరోసారి చర్చకు వచ్చింది.

ఈ నేపథ్యంలోనే టెస్లా, స్పేస్ ఎక్స్ సంస్థల అధినేత, బిలియనీర్ ఎలన్ మస్క్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ప్ర‌తిభావంతులైన భార‌తీయుల కారణంగా అమెరికా భారీగా ల‌బ్ధి పొందుతున్న‌ట్లు మ‌స్క్ ట్వీట్ చేశారు.

ట్విట్టర్ సీఈవోగా నియమితులైన పరాగ్ అగర్వాల్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ లాస్ ఏంజిల్స్‌కు చెందిన స్ట్రైప్ కంపెనీ సీఈవో ప్యాట్రిక్ కొలిస‌న్ ఓ ట్వీట్ చేశారు.

ఆ ట్వీట్‌లో భార‌తీయుల ప్రతిభపై కొలిసన్ ప్రశంసల వర్షం కురిపించారు.గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌, అడోబ్‌, ఐబీఎం, పాలో ఆల్టో నెట్వ‌ర్క్స్‌, ఇప్పుడు ట్విట్ట‌ర్ సీఈవో‌లు అంతా ఇండియాలో పుట్టి, పెరిగిన‌వాళ్లే అని కొలిసన్ అన్నారు.

టెక్నాల‌జీ ప్ర‌పంచంలో భార‌తీయులు అద్భుతమైన విజ‌యాన్ని సాధించ‌డం ఆనందంగా ఉంద‌ని ఆయ‌న పేర్కొన్నారు.

వలసదారులకు అమెరికా ఇస్తున్న అవ‌కాశాలు స‌ద్వినియోగం అవుతున్న‌ట్లు త‌న ట్వీట్‌లో ప్యాట్రిక్ అభిప్రాయపడ్డారు.

ఆ ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ మ‌స్క్ పై విధంగా కామెంట్ చేశారు. """/" / ఇకపోతే.

పరాగ్ అగర్వాల్ విషయానికి వస్తే.ముంబైలో పుట్టిపెరిగిన ఆయన ఐఐటీ బాంబేలో కంప్యూటర్ సైన్స్‌లో గ్రాడ్యుయేషన్ చేశారు.

అనంతరం కాలిఫోర్నియాలోని స్టాన్ ఫోర్డ్ యూనివర్సీటిలో పై చదువులు చదివారు.తర్వాత మైక్రోసాఫ్ట్, యాహూ వంటి సంస్థలలో పనిచేసి 2011లో ట్విట్టర్‌లో చేరారు.

2017లో సీటీవోగా ప్రమోషన్ లభించింది.ఆపై ప్రాజెక్ట్ బ్లూ స్కూ అనే టీమ్‌కు ఇన్‌ఛార్జ్‌గా బాధ్యతలు నిర్వర్తించారు.

స్టార్ హీరోలు దర్శకులను కాదు కథలను నమ్మితే బాగుంటుంది…