Ameesha Patel : షూటింగ్ లో కనీసం ఫుడ్ బిల్లు కూడా చెల్లించలేదు.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న హీరోయిన్?
TeluguStop.com
అమీషా పటేల్( Ameesha Patel ) తెలుగు సినీ ప్రేక్షకులకు ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.
తెలుగులో ఎన్నో సినిమాలలో నటించి హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది అమీషా పటేల్.
తెలుగులోనే కాకుండా హిందీలో పలు సినిమాలలో నటించి మెప్పించింది.తెలుగు హిందీ భాషల్లోకి ఒకేసారి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.
అప్పట్లో తెలుగులో స్టార్ హీరోల సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ.
ప్రస్తుతం టాలీవుడ్ సినిమాలలో నటించకపోయినప్పటికీ బాలీవుడ్ లో వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతోంది.
"""/" /
అలాగే పంజాబీ సినిమాలలో కూడా నటిస్తోంది.కాగా ఈ ముద్దుగుమ్మ గదర్-2 సినిమాతో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధంగా ఉంది.
కాగా ఇటీవలే గదర్-2 మూవీ( Gadar 2 ) చివరి షూటింగ్ షెడ్యూల్‌లో పాల్గొన్న భామ చిత్ర యూనిట్‌పై షాకింగ్ కామెంట్స్ చేసింది.
మే నెల చివర్లో జరిగిన గదర్-2 షూటింగ్‌లో నిర్మాణ సంస్థ తీరు పట్ల అమీషా పటేల్ వరుస ట్వీట్లు చేసింది.
అనిల్ శర్మ( Anil Sharma ) ప్రొడక్షన్స్ తమకు ఆహారం, వసతి, రవాణా కోసం ఎలాంటి బిల్లులు చెల్లించలేదని ఆరోపించింది.
తాము పడిన కష్టాలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంది.అనిల్ శర్మ ప్రొడక్షన్స్ వారు ఆహారం, వసతి, రవాణా కోసం బిల్లులు చెల్లించేదని అమీషా పటేల్ ఆరోపించింది.
కాగా అమీషా పటేల్ తన ట్వీట్‌లో ఈ విధంగా రాసుకొచ్చింది. """/" /
మేకప్ ఆర్టిస్టులు, కాస్ట్యూమ్ డిజైనర్లు, సాంకేతిక నిపుణులు, ఇతర సిబ్బందికి సరైన వేతన బకాయిలు చెల్లించలేదు.
షూటింగ్ చివరి రోజున చండీగఢ్ విమానాశ్రయానికి వెళ్లేందుకు, ఆహార బిల్లులకు కూడా డబ్బులు చెల్లించలేదు.
నటీనటులు, సిబ్బందికి కార్లు కూడా సమకూర్చలేదు.అక్కడే ఒంటరిగా వదిలిలేశారు.
కానీ వెంటనే జీ స్టూడియోస్ వారు రంగంలోకి దిగి అన్ని బకాయిలు చెల్లించారు.
అనిల్ శర్మ ప్రొడక్షన్స్ తప్పులను వారు సరిదిద్దారు.గదర్ 2 అనిల్ శర్మ ప్రొడక్షన్స్ నిర్వహిస్తోందని అందరికీ తెలుసు.
ఈ సమస్యను పరిష్కరించిన షరీక్ పటేల్, నీరజ్ జోషి, కబీర్ ఘోష్, నిశ్చిత్ లకు ప్రత్యేక ధన్యవాదాలు.
జీ స్టూడియోస్ టీమ్( Zee Studios Team ) ఎప్పుడు అగ్రస్థానంలోనే ఉంటుంది అని రాసుకొచ్చింది అమీషా పటేల్.
ప్రస్తుతం అందుకు సంబంధించిన ట్వీట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అమెరికన్లు బైడెన్ – హారిస్‌పై కసి తీర్చుకున్నారు .. ట్రంప్ గెలుపుపై భారత సంతతి నేత