స్టార్ హీరో అమీర్ ఖాన్.. ఆ పేద కుటుంబాన్ని మోసం చేశాడు?

రాజకీయ నాయకులు మాట ఇచ్చి మారుస్తారు అని తెలుసు గాని.సినిమా హీరోలు కూడా అదే తీరులో ఉంటారన్నది మాత్రం చాలామందికి తెలియదు.

ఇక ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హీరో ఇలా ఒకప్పుడు ఇచ్చిన మాట మరిచి పోయాడు.

అనగనగా 2009.త్రీ ఇడియట్స్ సినిమాలో హీరోగా నటించాడు అమీర్ ఖాన్.

సినిమా సూపర్ హిట్.అయితే ఈ సినిమా ప్రమోషన్ సమయంలో మధ్యప్రదేశ్ లో పర్యటించారు.

ఇక అక్కడ చేనేత వస్త్రాలకు మారుపేరైన పాన్పూర్ లో సందర్శించి కమలేష్ అనే వ్యక్తి తో మాట్లాడాడు.

ఈ క్రమంలోనే చేనేత కార్మికులు పడుతున్న కష్టాలు తెలుసుకున్నాడు అమీర్ ఖాన్.దీంతో మీకు సహాయం చేస్తాను అని మాట ఇచ్చాడు.

ఈ విషయం మీకు గుర్తుందా.అబ్బే గుర్తు లేదండి అని అంటారా.

గుర్తుండదు లేండి ఎందుకంటే మాట ఇచ్చిన అమీర్ ఖాన్ కే ఈ విషయం గుర్తు లేదు.

కేవలం ఆ వార్త చదివిన మనకు ఈ విషయం ఎలా గుర్తుంటుంది చెప్పండి.

నిజమే మరి స్టార్ హీరో అమీర్ ఖాన్ కోట్ల కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటాడు.

ఈ క్రమంలోనే త్రీ ఇడియట్స్ సమయంలో చేనేత కార్మికుడు కమలేష్ కి భరోసా ఇచ్చాడు.

ఇక చేనేత కార్మికులందరికీ ఇబ్బందులు లేకుండా ముంబైలో ఒక ప్రత్యేకమైన షో రూమ్ ఏర్పాటు చేస్థా అంటూ చెప్పాడు.

అంతేకాదు ఇక ఆ చేనేత వస్త్ర కార్మికుల దగ్గర 25 వేల విలువైన చీరలు కొన్నాడు.

తన చేతికి ఉన్న బంగారు ఉంగరాన్ని కూడా బహుమతిగా ఇచ్చాడు.ఇక ఇదంతా వార్తల్లో చదివిన ప్రేక్షకులు అభిమానులు అమీర్ ఖాన్ ఎంతో గొప్పవాడు.

రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా హీరో.చేనేత కార్మికుల కోసం ఎంత చేయబోతున్నాడు అని అనుకున్నారు.

తర్వాత కొన్నాళ్లకు ఇలాంటి వార్తలు మాయమయ్యాయి.అమీర్ ఖాన్ మనసులో కూడా ఇచ్చిన మాట తుడిచిపెట్టుకుపోయిందని అర్థమౌతుంది.

ఎందుకంటే ఈ ఘటన జరిగి 13 సంవత్సరాలు కావస్తుంది.కరోనా తో ఇటీవలే కమలేశ్ మృతిచెందాడు కూడా.

కానీ వారి కష్టాలు మాత్రం తీరలేదు.ఆర్థిక పరిస్థితి మరింత దిగజారి పోయింది.

చేనేత వృత్తిని వదిలేసి బీడీలు చుట్టుకుంటూ ఆ కుటుంబం బ్రతుకుతుంది. """/"/ అయితే తన భర్త అమీర్ ఖాన్ ను కలిసేందుకు ఎన్నిసార్లు ప్రయత్నించినా కుదరలేదని ఆయన ఇచ్చిన నెంబర్ కూడా పని చేయలేదని మరి చెప్పుకొచ్చింది.

ఇప్పటికీ అమీర్ ఖాన్ తమ కుటుంబాన్ని ఆదుకుంటారని ఆశతో ఎదురు చూస్తున్నాము అంటూ ఆ కుటుంబం మీడియాతో బాధను చెప్పుకొచ్చింది.

చదివిన ఐఐటీకి 228 కోట్ల రూపాయల భారీ విరాళం.. ఈ వ్యక్తి మనస్సుకు ఫిదా అవ్వాల్సిందే!