కరోనా బాధితురాలిపై అత్యాచారం చేసిన అంబులెన్స్ డ్రైవర్ !

ఆపదలో ఉన్న వారిని ఆస్పత్రికి చేర్చే ఓ అంబులెన్స్ డ్రైవర్ కరోనా సోకిన ఓ బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

అంబులెన్స్ లో నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు.అనంతరం ఆస్పత్రికి తరలించడంతో బాధితురాలు వైద్యులకు అసలు విషయం తెలిపింది.

ఈ మేరకు పోలీసులకు సమాచారం అందించడంతో నిందితుడిని అరెస్ట్ చేశారు.కరోనా పాజిటివ్ వచ్చిన 19 ఏళ్ల యువతిని అత్యాచారం చేసిన ఘటన కేరళలోని పతనంతిట్టిలో శనివారం చోటు చేసుకుంది.

కోవిడ్ ఆస్పత్రికి తరలించే క్రమంలో అంబులెన్స్ డ్రైవర్ తొలత ఓ పెద్దావిడను పండలం ఆస్పత్రికి తరలించాడు.

అనంతరం మరో 19 ఏళ్ల యువతిని ఆస్పత్రికి తరలించే క్రమంలో మార్గమధ్యంలో అంబులెన్స్ దారిని మళ్లించాడు.

నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు.అనంతరం ఆస్పత్రికి తరలించాడు.

బాధితురాలు ఆస్పత్రి సిబ్బందికి జరిగిన విషయం తెలుపడంతో విషయం వెలుగులోకి వచ్చింది.దీంతో సిబ్బంది పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు అంబులెన్స్ డ్రైవర్ నౌఫర్ (29) ను అదుపులోకి తీసుకున్నారు.

ఈ ఘటనపై కేరళ ఆరోగ్యశాఖ మంత్రి కేకే.శైలజ స్పందించి నిందితుడిని కఠినంగా శిక్షించాలని ఆదేశించింది.

నిందితుడిని అరెస్ట్ చేసిన తర్వాత 108 అంబులెన్స్ విధుల నుంచి తొలగించారు.బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.

బ్రిటన్ హౌస్ ఆఫ్ లార్డ్స్‌కు నామినేట్ అయిన భారత సంతతి వ్యక్తి .. ఎవరీ క్రిష్ రావల్?