అజ్ఞానం తొలగించి జ్ఞానాన్ని పంచిన మేధావి అంబేద్కర్ సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు..!
TeluguStop.com
రేపు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్( Dr.B.
R.Ambedkar ) 132వ జయంతి సందర్భంగా సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
అంబేద్కర్ ను స్మరించుకుంటూ .భారత రాజ్యాంగ నిర్మాతగా దేశ గమనాన్ని మార్చటంలో ఆయన పోషించిన పాత్ర చిరస్మరణీయమని పేర్కొన్నారు.
ఎంతటి కష్టమైన పనైనా చిత్తశుద్ధితో .పట్టుదలతో ప్రయత్నిస్తే సాధించలేనిది ఏదీ లేదని అంబేద్కర్ జీవితం నేర్పిస్తుంది.
అడ్డంకులను ఆత్మవిశ్వాసంతో ఆయన ఎదుర్కొని జీవించిన విధానం ఎంతోమందికి మార్గదర్శకం.దేశ భవిష్యత్తుకు సంబంధించి గొప్ప ఆలోచనలు చేస్తూ గెలుపు శిఖరాలకు చేరుకున్న విశ్వ మానవుడు అంబేద్కర్.
సమాజంలో అజ్ఞానాంధకారాలను చీల్చి జ్ఞానపు వెలుగులు అందించిన మేధావి.అంటూ కేసీఆర్ కొనియాడారు.
"""/" /
ఆయన రచనలు మరియు ప్రసంగాలు ఎన్నో ఆలోచింపజేస్తాయి.దేశంలో సమాన హక్కుల కోసం జీవితాంతం పరితపించి ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగాన్ని రూపొందించారు.
నేడు అణగారిన వర్గాలు అనుభవిస్తున్న ఫలాలు అంబేద్కర్ సమకూర్చినవే అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ కొనియాడారు.
ఇదిలా ఉంటే రేపు హుస్సేన్ సాగర్ తీరాన ఏర్పాటు చేసిన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించబోతున్నారు.
"""/" / తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తూ ఉంది.
ఈ 125 అడుగుల ఎత్తు నిర్మించిన బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అంబేద్కర్ మనవడు ప్రకాష్ అంబేద్కర్( Prakash Ambedkar).
పలు రాష్ట్రాల ప్రతినిధులు హాజరు కానున్నారు.
Game Load Optimization & Casino Advertising Ethics For Canadian High Rollers