చంద్రబాబు హయాంలో ఎన్నిసార్లు కరెంటు ఛార్జీలు పెంచారో జనాలకి తెలుసు.. అంబటి రాంబాబు

అమరావతి: అంబటి రాంబాబు పాయింట్స్.ఉగాదిలో షడ్రుచులు ఉంటాయి.

కానీ చంద్రబాబు కు గత మూడు ఉగాదుల నుంచి కేవలం చేదు మాత్రమే తగులుతోంది.

జగన్ సీఎం అయ్యాక‌ మంచి పేర్లతో కొత్త సంవత్సరాదులు వస్తున్నాయి.గ్రామాల్లో చక్కటి స్కూల్స్ వచ్చాయి, విలేజ్ క్లినిక్ లు వచ్చాయి.

వర్షాలు పుష్కలంగా పడ్డాయి.రిజర్వాయర్లు నిండాయి.

లక్షా 35 వేల కోట్లు పేదల ఖాతాలో వేశాం.కొత్త జిల్లాలు, గ్రామ సచివాలయాలతో విప్లవాత్మక మార్పులు వచ్చాయి.

వీటిని చూసి చంద్రబాబు ఓర్వలేక పోతున్నారు.ఉక్రెయిన్ యద్దం, ఇతరత్రా అనేక అంశాల కారణంగా స్వల్పంగా కరెంటు ఛార్జీలు పెంచాం.

దాన్ని కూడా టీడీపీ వారు తప్పుడు ప్రచారం చేస్తున్నారు.ఏపీ కంటే తెలంగాణలో భారీగా కరెంటు ఛార్జీలు పెంచినది కనపడటం లేదా? దేశంలో చూస్తే మన రాష్ట్రంలో నే తక్కువ ఛార్జీలు ఉన్నాయి.

పది రోజుల్లో తొమ్మిది సార్లు పెట్రోలు ధరలను కేంద్రం పెంచింది.మరి బీజేపీ ని ఎందుకు ప్రశ్నించటం లేదు? లోకేష్ పగటిపూటే లాంతర్లు పెట్టుకుని తిరుగుతున్నారు.

పవన్ కళ్యాణ్ తన పవర్ చూపించి కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించటం లేదు? 68 వేల కోట్లు బకాయి చేసింది టీడీపీ.

అవన్నీ తీర్చుకుంటూ మేము‌ ముందుకు వెళ్తున్నాం‌.కొవ్వొత్తి, అగ్గిపెట్టెను ఇంటింటికి పంపిస్తామని టీడీపీ చెప్తోంది.

వాటితోపాటు టీడీపీ జెండాను కూడా పంపించాలని కోరుతున్నా.అప్పుడు జనం‌ ఆ అగ్గిపెట్టెతో టీడీపీ జెండాను తగలపెడతారు.

జగన్ కి ప్రజలపై భారం వేయటం అసలు ఇష్టం ఉండదు.అలా చేయాలంటే ఆయన ప్రాణం విలవిల లాడుతుంది.

కానీ తప్పనిసరి పరిస్థితుల్లో స్వల్పంగా ఛార్జీలు పెంచారు.దీనిపై విమర్శలు చేసే నైతిక హక్కు చంద్రబాబుకు లే్దు.

చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఎన్నిసార్లు పెంచారో జనానికి తెలుసు.ఇప్పుడు పెంచిన ఛార్జీలు ఎందుకు పెంచామో జనం అర్థం చేసుకుంటారు.

ప్రజల్లోకి టీడీపీ వాళ్లు వెళ్తే జనం వారిని చొక్జాలు పట్టుకుంటారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – నవంబర్13, బుధవారం2024