టీడీపీతో ఈసీ అధికారులు కుమ్మక్కు అంటూ అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు..!!

వైసీపీ నేత అంబటి రాంబాబు( Ambati Rambabu ) సంచలన వ్యాఖ్యలు చేశారు.

రాష్ట్రంలో టీడీపీతో( TDP ) ఎన్నికల సంఘం అధికారులు కుమ్మక్కయ్యారని ఆరోపించారు.మాచర్లలో( Macherla ) నియోజకవర్గం పరిధిలో అనేక పోలింగ్ కేంద్రాల్లో అరాచకాలు జరిగాయి.

వైసీపీ సానుభూతిపరులు ఓటు వేయకుండా తెలుగుదేశం నాయకులు అడ్డుకున్నారు.కొంతమంది దాడులకు పాల్పడి పోలింగ్ స్టేషన్ నుండి వైసీపీ సానుభూతిపరులను బయటకు గెంటేయటం జరిగింది.

ఈ క్రమంలో పోలింగ్ సజావుగా జరగాలని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి( Pinnelli Ramakrishna Reddy ) అధికారులను కూడా వేడుకున్నారు.

కానీ ఎక్కడ కూడా అధికారులు చర్యలు తీసుకోలేదు.ఇదిలా ఉంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం చేశారని వీడియో ఒకటి విడుదల అయింది.

అది లోకేష్.తెలుగుదేశం విభాగానికి సంబంధించిన సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు.

"""/" / ఎన్నికల సంఘం( Election Commission ) దగ్గర ఉండాల్సిన వీడియో.

తెలుగుదేశం పార్టీ రిలీజ్ చేయటం ఏంటి అంటూ అంబటి రాంబాబు నిలదీశారు.అది వాస్తవమైన వీడియో యేనా కాదా ఎలక్షన్ కమిషన్ చెప్పాలని పేర్కొన్నారు.

తెలుగుదేశం విడుదల చేసిన ఈ వీడియో పై ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోవటం ఏమిటి అని ప్రశ్నించారు.

నేరం ఎవరు చేసినా చట్టం శిక్షిస్తుంది.నిజంగా నేరం చేసిన వారిపై చర్యలు తీసుకోకుండా.

ప్రయత్నాలు జరగటం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు.బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలి.

ఈ క్రమంలో ఎక్కడైతే గొడవలు జరిగాయో వాటికి సంబంధించిన పూర్తి వీడియోలు ఎలక్షన్ కమిషన్ బయట పెట్టాలి అని అంబటి రాంబాబు డిమాండ్ చేశారు.

క్యారెట్ తో ఆరోగ్యమే కాదు జుట్టును కూడా పెంచుకోవ‌చ్చు.. ఇంతకీ ఎలా వాడాలంటే?