పవన్ కళ్యాణ్ కంటే నేనే బాగా డ్యాన్స్ చేశానని చెప్పారు.. అంబటి రాంబాబు కామెంట్స్ వైరల్!
TeluguStop.com
ఏపీలో రాజకీయ( Politics In AP ) ప్రచారం జోరుగా సాగుతోంది.గెలుపు కోసం ప్రముఖ రాజకీయ పార్టీల నేతలు రాష్ట్రంలో పర్యటిస్తూ హామీలను ప్రచారం చేసుకుంటున్నారు.
వైసీపీ నేత అంబటి రాంబాబు( Ambati Rambabu ) సంక్రాంతి పండుగ సమయంలో వేసిన డ్యాన్స్ లకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అయిన సంగతి తెలిసిందే.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో డ్యాన్స్ వీడియోల గురించి అంబటి రాంబాబు మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.
చాలామంది నాకు ఫోన్ చేసి మీ డ్యాన్స్ అద్భుతంగా ఉంది అని చెప్పారని అంబటి పేర్కొన్నారు.
పవన్ కళ్యాణ్ కూడా ఇలా డ్యాన్స్ చేయలేరు చిరంజీవి( Chiranjeevi ) మాత్రమే చేయగలరని చెప్పారని ఆయన అన్నారు.
నిన్ను డామినేట్ చేసేది చిరంజీవే కానీ పవన్ కళ్యాణ్ చేయలేరని చెప్పారని అంబటి రాంబాబు వెల్లడించడం గమనార్హం.
పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) మెడపై చేతులు పెట్టుకుంటారే తప్ప డ్యాన్స్ చేయలేడని కామెంట్ చేశారని ఆయన అన్నారు.
"""/" /
నీ వయస్సు 66 సంవత్సరాలు అయినా పవన్ కళ్యాణ్ తో పోల్చి చూస్తే అద్భుతంగా చేశావని అన్నారని అంబటి రాంబాబు వెల్లడించారు.
సినిమా ఫీల్డ్ వాళ్లు ఫోన్ చేసి ఈ విషయాలను చెప్పారని ఆయన పేర్కొన్నారు.
ఆ సినిమా వాళ్ల పేర్లు చెప్పడం అనవసరం అని అంబటి రాంబాబు వెల్లడించారు.
నేను పేర్లు చెబితే వాళ్లు బాధ పడతారని ఆయన పేర్కొన్నారు. """/" /
అంబటి రాంబాబు చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
అంబటి కామెంట్స్ పై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రం ఫైర్ అవుతున్నారు.నీకు ఇలా కూడా అనిపిస్తోందా అని కొంతమంది కామెంట్లు చేస్తుండగా వచ్చే ఎన్నికల్లో అంబటి ఓడిపోతే సినిమాల్లోకి రావాలంటూ మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు.
అంబటి చెబుతుంటే నవ్వు ఆపుకోలేకపోయామని మరి కొందరు చెబుతున్నారు.అంబటి రాంబాబు చెప్పిన విషయాలు మాత్రం నెట్టింట తెగ వైరల్ అవుతుండటం గమనార్హం.
శ్రీవారి సన్నిధిలో మరో విషాదం.. లడ్డూ కౌంటర్లో అగ్నిప్రమాదం