అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోజ్ భారత్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే.ఇక ఈ పర్యటనలో భాగంగా భారత్ లో సంస్థ నిర్దేశించుకున్న లక్ష్యాలని ప్రకటించారు.
ఇక ఇండియాలో సంస్థ తరుపున రానున్న ఐదేళ్ళలో 70 వేల కోట్ల విలువైన భారత్ తయారీ వస్తువులని ఎగుమతి చేస్తామని తెలియజేశారు.
అలాగే చిన్న, మధ్య తరహా పరిశ్రమల కార్యకలాపాలని డిజిటలైజేషన్ కోసం బిలియన్ డాలర్లు కేటాయించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.
ఢిల్లీలో చిన్న, మధ్య తరహా పరిశరాల కోసం అమెజాన్ సంస్థ సదస్సు నిర్వహించింది.
ఈ సదస్సులో పాల్గొన్న జెఫ్ తమ సుదీర్ఘ లక్ష్యాలని తెలియజేశారు.ఈ పర్యటనలో భాగంగా జెఫ్ భారత్ పురోగతిలో తాము భాగస్వామ్యం కావాలని అనుకుంటున్నట్లు తెలిపారు.
ఈ దశాబ్దం అంతా భారత్ దే అని కొనియాడారు.అత్యంత వేగంగా భారత్ అభివృద్ధి వైపు పరుగులు పెడుతుందని అన్నారు అయితే అమెజాన్ కారణంగా తమ వ్యాపారాలు దెబ్బ తింటాయని చిన్న, మధ్య తరగతి వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రెండేళ్లుగా సినిమా లేదు.. అయినా అవార్డ్.. సమంత ఎమోషనల్ కామెంట్స్ వైరల్!