క్రియేటివ్ గా అసలు విషయాన్ని చెప్పేసిన అమెజాన్..!

అమెరికా దేశానికి చెందిన ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఓటి ఫ్లాట్ ఫామ్ లో ఉన్న పోటీని ఎదుర్కొని తన సత్తా ఏంటో రోజు రోజుకు నిరూపించుకుంటూ ముందుకు దూసుకువెళ్తుంది అమెజాన్ ప్రైమ్ వీడియో.

ఈ అమెజాన్ ప్రైమ్ లో భాగంగా ఒరిజినల్ కంటెంట్ మాత్రమే కాకుండా సినిమాలు కూడా హెచ్డి క్వాలిటీతో ప్రపంచంలోని అనేక దేశాలలో సర్వీసును అందిస్తోంది.

అయితే తాజాగా అమెజాన్ ప్రైమ్ లో కొత్త ట్రెండ్ ను క్రియేట్ చేస్తోంది.

అయితే ఇందుకు కారణం లేకపోలేదు. """/"/ ఇందుకు కారణం ప్రముఖ స్ట్రీమింగ్ ఫ్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లాగానే అమెజాన్ ప్రైమ్ కూడా తమ వినియోగదారుల కోసం మొబైల్ ఎడిషన్ ను ప్రవేశపెట్టిన కారణం చేత ఆ విషయాన్ని ప్రజలకు చేరవేయడానికి అమెజాన్ ప్రైమ్ వీడియో కాస్త క్రియేటివ్ గా ఆలోచించి ఈ నిర్ణయాన్ని చేపట్టింది.

భారత్ లో అధిక శాతం కంప్యూటర్ కంటే మొబైల్ వాడకం ఎక్కువ కాబట్టి వారికోసం అమెజాన్ ప్రత్యేకంగా ఓ మొబైల్ ఎడిషన్ అందుబాటులోకి తీసుకువచ్చింది.

స్ట్రీమింగ్ ఎంగేజ్మెంట్ లో భారత్ మొదటి స్థానంలో ఉండటం కారణంగా కస్టమర్లకు మరింత హై క్వాలిటీ కంటెంట్ అందించాలన్న ఉద్దేశంతో అమెజాన్ ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్ ప్రారంభించామని అమెజాన్ ప్రతినిధులు తెలుపుతున్నారు.

ఏపీ ఎన్నికల సరళి పై సినీ నటుడు నరేష్ కీలక వ్యాఖ్యలు..!!