కన్నడ నటుడు పునీత్ ఫ్యాన్స్ కి అదిరిపోయే ఆఫర్ ఇచ్చిన అమెజాన్.. ఏంటంటే?

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గత ఏడాది అక్టోబర్ 29వ తేదీ గుండెపోటుతో మృతి చెందిన సంగతి అందరికీ తెలిసిందే.

ఆయన మరణానంతరం ఆయన చేసిన సేవా కార్యక్రమాలు తెలిసి ఎంతోమంది షాక్ అయ్యారు.

అలాగే మరణం తర్వాత చాలా మంది అభిమానులు ఏదో ఒక రూపంలో ఈయనపై ఉన్న ప్రేమాభిమానాలను బయట పెడుతూ వచ్చారు.

ఈ క్రమంలోనే ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన అమెజాన్ పునీత్ రాజ్ కుమార్ కి ట్రిబ్యూట్‌ ఇవ్వబోతుంది.

ఈ క్రమంలోనే కన్నడనాట పునీత్ అభిమానులకు అమెజాన్ ఫ్రీగా సినిమాలు చూసే అద్భుతమైన ఆఫర్ ను ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలోనే పునీత్ రాజ్ కుమార్ నిర్మాణ సంస్థ అయిన పీఆర్‌కే ప్రొడక్షన్‌లో నిర్మితమైన `వన్‌ కట్‌ టూ కట్‌`, `ఫ్యామిలీ ప్యాక్‌`, `మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌` చిత్రాల రిలీజ్ హక్కులను దక్కించుకున్న అమెజాన్ ఈ సినిమాలను అమెజాన్ ప్రైమ్ ద్వారా విడుదల చేస్తూ పునీత్ అభిమానులకు ఈ సినిమాని ఫిబ్రవరి నెల మొత్తం ఫ్రీగా చూసే అవకాశాన్ని కల్పించారు.

"""/"/ పునీత్ రాజ్ కుమార్ పై ఉన్న అభిమానంతో అమెజాన్ తీసుకున్న ఈ నిర్ణయానికి అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఈ విధంగా అమెజాన్ ప్రైమ్ నటుడు పునీత్ పై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు.

కేవలం ఈ చిత్రాలు మాత్రమే కాకుండా పునీత్ నిర్మాణ సంస్థలో తెరకెక్కిన మాయాబజార్ 2016, లా, ఫ్రెంచ్ బిర్యాని, కలువు దారి,యువరత్న వంటి సినిమాలను కూడా ఫ్రీగా చూసే అవకాశాన్ని అమెజాన్ కల్పించింది.

ఇలా అమెజాన్ పునీత్ అభిమానులకు అదిరిపోయే ఆఫర్లు ఇవ్వడంతో పునీత్ ఫాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Jangaon ACP Damodar Reddy : జనగామ ఏసీపీ దామోదర్ రెడ్డిపై ఎన్నికల కమిషన్ వేటు