యాష్ రాజ్ ఫిలిమ్స్‌, అమెజాన్ ప్రైమ్‌కు మధ్య వంద కోట్ల డీల్.. ఎందుకంటే?

యష్ రాజ్ ఫిల్మ్.దీనిని వైఆర్ఎఫ్ అని కూడా పిలుస్తుంటారు.

దీనిని ప్రొడ్యూసర్ యాష్ చెప్రా 1970 లో ఏర్పాటు చేశాడు.ఇండియాలోని అతిపెద్ద ఫిల్మ్ స్టూడియోస్‌లోనే ఇది కూడా ఒకటిగా నిలిచింది.

దీని నుంచి ఏ మూవీ రిలీజైనా అది ఒక సెన్సేషన్ అనే చెప్పాలి.

దీని ఆధ్వర్యంలో తాజాగా నిర్మించిన నాలుగు క్రేజీ మూవీస్ ఇప్పుడు ఓటీటీలోకి కాబోతున్నాయి.

కరోనా లాక్ డౌన్‌కు ముందు వరకు చాలా మంది థియేటర్స్‌లోనే దాదాపుగా మూవీస్ చూసేవారు.

కొత్త మూవీ రిలీజ్ అయిందంటే థియేటర్స్ ఆడియన్స్‌తో నిండిపోయేవి.ఇక కరోనా ఎఫెక్ట్ వల్ల లాక్‌డౌన్ విధించడంతో థియేటర్స్ పరిస్థితి మరీ అధ్వానంగా మారింది.

అప్పటి వరకు ఓటీటీలు కొనసాగుతున్నా.వాటికి అంత పెద్దగా డిమాండ్ లేదు.

లాక్‌డౌన్ సమయంలో థియేటర్స్ మూతపడ్డాయి.దీంతో ఆడియన్స్ అంతా ఓటీటీల బాట పట్టారు.

దీంతో చాలా సినిమాలు థియేటర్స్‌లోకి అడుగు పెట్టకముందే ఓటీటీలో డైరెక్ట్‌గా రిలీజ్ కావడం మొదలైంది.

తర్వాతి కాలంలో లాక్‌డౌన్ ఎత్తేశాక థియేటర్స్ ఓపెన్ చేసేందుకు ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది.

అయినా చాలా మంది ఆడియన్స్ థియేటర్స్ కు రావడానికి భయపడుతున్నారు.అందుకే ఇప్పటికీ చాలా సినిమాలు ఓటీటీలోనే రిలీజ్ అవుతున్నాయి.

ఇక ఇందులో అమెజాన్ ప్రైమ్ దాదాపు క్రేజీ మూవీస్‌ను దక్కించుకుని ఆడియన్స్‌ను తన వైపు తిప్పుకోవడంలో సక్సెస్ అవుతోంది.

"""/"/ ప్రస్తుతం యాష్ ఫిలింస్ నుంచి 4 క్రేజ్ ఉన్న మూవీస్‌కు సంబంధించిన డిజిటల్‌రైట్స్‌ను దక్కించుకుంది అమెజాన్ ప్రైమ్.

బంటీ ఔర్ బబ్లీ, పృథ్వీరాజ్, జయేష్ భాయ్ జోర్దార్, షంషేరా వంటి మూవీస్ అమెజాన్ ప్రైమ్‌లోకి రాబోతున్నాయి.

అంటే డైరెక్ట్‌గా కాదు.థియేటర్‌లో రిలీజ్ అయ్యాక 4 వారాల తర్వాత స్ట్రీమింగ్ కాబోతున్నాయి.

ఇందుకు గానూ అమెజాన్ ప్రైమ్.యాష్ రాజ్ ఫిల్మ్స్‌కు సుమారుగా వంద కోట్లు ఇచ్చిందని ఫిల్మ్ వర్గాల సమాచారం.

బంటీ అవుర్ బబ్లీ మూవీ వచ్చేనెల 19 న రిలీజవుతోంది.ఇక అక్షయ్‌కుమార్ యాక్ట్ చేసిన పృథ్వీరాజ్, రణ్‌వీర్‌సింగ్ యాక్ట్ చేసిన జయేష్ భాయి జోర్దార్, రణ్‌బీర్‌కపూర్ యాక్ట్ చేసిన షంషేరా మూవీస్ మీద ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి.