గ్యాస్ వినియోగదారులకు అమెజాన్ శుభవార్త.. సిలిండర్ పై తగ్గింపు ఆఫర్.. !!

నేడు దేశంలో మధ్యతరగతి మానవుడు కడుపునిండా తిండి తినే పరిస్దితులు లేవన్న విషయం అందరికి తెలిసిందే.

ఇక రెక్కాడితే గానీ డొక్కాడని వాళ్ల గురించి చెప్పుకుంటే కళ్లల్లో నీళ్లు తిరగడం ఖాయం.

ఎందుకంటే చాలీచాలని కూలీలతో బ్రతుకులు వెళ్ళదీస్తున్న పేదలు మంచి నీళ్లు తాగి కడుపులు నింపుకునే పరిస్దితులు తలెత్తాయి.

సంపాదన చారాణా, ఖర్చులు రూపాయి.మరి ఇలాంటి పరిస్దితుల్లో ఏదైనా వస్తువు మీద పది రూపాయలు మిగిలిన చాలనీ ఆశపడటం మధ్యతరగతి జీవికి పుట్టుకతో వచ్చిన గుణం.

ఈ క్రమంలో గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ గుడ్ న్యూస్ అందించింది.

అమెజాన్ పే ద్వారా గ్యాస్ సిలిండర్ బుక్ చేస్తే ఆ సిలిండర్ బుకింగ్‌ పై రూ.

50 వరకు తగ్గింపు ఆఫర్ ప్రకటించింది.దీని కోసం అమెజాన్ యాప్ తప్పక ఉపయోగించాలని పేర్కొంటుంది.

ఇకపోతే ఫస్ట్ టైమ్ అమెజాన్ ద్వారా సిలిండర్ బుక్ చేస్తున్న వారికి మాత్రమే రూ.

50 తగ్గింపు ఆఫర్ లభిస్తుందని, కాగా ఇండేన్ కస్టమర్లు 7718955555 నెంబర్‌ కు కాల్ చేసి సిలిండర్ బుక్ చేసుకోవచ్చని తెలియచేస్తుంది.

కానీ ఈ ఆఫర్ మార్చి 31 వరకే అందుబాటులో ఉంటుంది.

రాజ్యసభకు మెగాస్టార్… క్లారిటీ ఇచ్చిన మెగా డాటర్ సుస్మిత?