ఐదు వేల కోట్లతో అమెజాన్ వ్యవస్థాపకుడి జెఫ్ బెజోస్ రెండో పెళ్లి

అమెజాన్ వ్యవస్థాపకుడు(Amazon Founder), ప్రపంచంలోనే రెండో అత్యంత సంపన్నుడు జెఫ్ బెజోస్ (Jeff Bezos)డిసెంబర్ 28న కొలరాడోలోని ఆస్పెన్‌లో హెలికాప్టర్ పైలట్, ఎమ్మీ అవార్డు విజేత లారెన్ శాంచెజ్‌ను(Lauren Sanchez) వివాహం చేసుకోనున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.

ఈ ప్రత్యేక సందర్భం కోసం గ్రాండ్ ఈవెంట్‌ను నిర్వహించడానికి పెద్దెత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ఈ వివాహానికి దాదాపు 600 మిలియన్ డాలర్లు అంటే మన భారత కరెన్సీలో సుమారు రూ.

5వేల కోట్లు ఖర్చు అవుతుందని అంచనా.ఈ వేడుకను ఆస్పెన్‌లో కెవిన్ కాస్ట్నర్ 160 ఎకరాల స్థలంలో నిర్వహించనున్నారు.

కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో జరగనున్న ఈ వివాహం ఘనతకు నిలువెత్తు ఉదాహరణగా నిలుస్తుంది.

"""/" / వివాహానికి ముందు డిసెంబర్ 26, 27 తేదీల్లో ఆస్పెన్‌లోని ప్రముఖ మత్సుహిసా సుషీ రెస్టారెంట్(Matsuhisa Sushi Restaurant) లో ప్రీ వెడ్డింగ్ వేడుకలు జరగనున్నాయి.

ఈ వేడుకలకు బిల్ గేట్స్, లియోనార్డో డికాప్రియో, క్రిస్ జెన్నర్ వంటి ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉంది.

లారెన్ శాంచెజ్(Lauren Sanchez) హాలీవుడ్ ఏజెంట్ పాట్రిక్ వైట్‌సెల్‌ను 2005లో వివాహం చేసుకున్నారు.

13 ఏళ్ల సహజీవనానంతరం 2019లో విడాకులు తీసుకున్నారు.వీరికి ఇవాన్, ఎల్లా అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.

బ్రాడ్‌కాస్ట్ జర్నలిస్టుగా కెరీర్ ప్రారంభించిన లారెన్, ఆపై "బ్లాక్ ఆప్స్ ఏవియేషన్" సంస్థను స్థాపించారు.

"""/" / జెఫ్ బెజోస్, 1994లో మెకెంజీ స్కాట్‌ను వివాహం చేసుకుని 25 ఏళ్ల పాటు సహజీవనం చేశారు.

2019లో విడాకులు తీసుకున్న ఈ జంటకు ముగ్గురు కుమారులు, ఒక దత్తపుత్రిక ఉన్నారు.

మెకెంజీ స్కాట్ ప్రస్తుతం ప్రపంచంలోని అత్యంత సంపన్న మహిళల్లో ఒకరుగా నిలిచారు.జెఫ్ బెజోస్ మొత్తం సంపద రూ.

20.26 లక్షల కోట్లు.

అమెజాన్ వ్యవస్థాపనతో పాటు, వాషింగ్టన్ పోస్ట్, బ్లూ ఆరిజిన్ వంటి సంస్థల ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపిస్తున్నారు.

ఈ వివాహం బిజినెస్, మీడియా, అంతర్జాతీయ సర్కిల్స్‌లో పెద్ద చర్చనీయాంశంగా మారింది.గ్రాండ్ స్థాయిలో జరగబోయే ఈ వేడుకలు గొప్ప క్షణాలను సృష్టించనున్నాయి.

ఐదు వేల కోట్లతో అమెజాన్ వ్యవస్థాపకుడి జెఫ్ బెజోస్ రెండో పెళ్లి