టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ గురించి మొదలు పెట్టగానే ముందుగా గుర్తుకు వచ్చేది, ముహూర్తాలు,ప్రారంభోత్సవాలు ఇలా ప్రతి ఒక్కటి కూడా సెంటిమెంట్ తోనే సాగుతాయి.
కధ అయినా షూటింగ్ అయినా ఏవైనా కూడా మంచి ముహూర్తం లేనిదే ఏ ఒక్క పని కూడా ప్రారంభించరు.
స్టార్ హీరో నుంచి చిన్న హీరో వరకు కూడా ఇదే పరిస్థితి.ఈ సెంటిమెంట్ తోనే నాని తన 25 వ సినిమా ను ఓటీటీ లో రిలీజ్ చేయడానికి ఒప్పుకున్నప్పటికీ తన సెంటిమెంట్ ను మాత్రం వదులుకోలేదు.
నాని ఫస్ట్ మూవీ అష్టా చమ్మా సినిమా కూడా పన్నెండేళ్ల క్రితం ఇదే రోజు అంటే సెప్టెంబర్ 5 నే రిలీజ్ అవ్వగా మంచి సక్సెస్ సాధించిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో తన వీ చిత్రం కూడా ఓటీటీ లో రిలీజ్ కు ముందుకు వచ్చినప్పటికీ తన సెంటిమెంట్ తేదీ నే ఆ మూవీ ని తొలిసారిగా ఓటీటీ లో రిలీజ్ చేయాలి అని నాని నిర్ణయించుకున్నారు.
చిత్ర యూనిట్ ఇదే ముహూర్తం ఖరారు చేసి అమెజాన్ ముందుంచింది కూడా.అయితే దీనికి ఓకే చెప్పిన సదరు సంస్థ ఫలితంగా ‘వి’ సినిమా అర్థరాత్రి 12 గంటల 5 నిమిషాలకు స్ట్రీమ్ చేయాల్సి ఉంది.
కానీ ఆ సంస్థ మాత్రం ఎవరికీ తెలియకుండా నాలుగవ తేదీ రాత్రి 10 గంటల సమయంలోనే ఈ చిత్రాన్ని ఓటీటీ లో రిలీజ్ చేసినట్లు తెలుస్తుంది.
అయితే అమెజాన్ తీసుకున్న ఈ నిర్ణయం అటు నిర్మాత కు గానీ,హీరో కి గానీ చిత్ర యూనిట్ ఎవరికీ కూడా ఇంత సమాచారం కూడా లేకుండా ఒక్కరోజు ముందే ఈ సినిమా ను అమెజాన్ లో స్ట్రీమింగ్ చేసి నాని లక్కీ డేట్ ను బ్రేక్ చేసింది.
అమెజాన్ చేసిన పనికి అటు హీరో ఇటు చిత్ర యూనిట్ అందరూ కూడా ఒక్కసారిగా అవాక్కైపోయారు పాపం.
నాని వెండితెర కు పరిచయం అయిన తోలి చిత్రం అష్టా చమ్మా,ఇప్పుడు ఓటీటీ లో రిలీజ్ అయిన వీ చిత్రం రెండిటికి కూడా ఇంద్రగంటి మోహన కృష్ణ నే డైరెక్టర్.
అదిదా ట్విస్ట్.. భార్యను ప్రియుడికి ఇచ్చి పెళ్లి చేసిన భర్త.. కానీ చివరకు?