ఇండియాలో అమెజాన్ పై ఆధిపత్యం ప్రదర్శిస్తున్న నెట్‌ఫ్లిక్స్‌

మూడు నాలుగు సంవత్సరాల క్రితం వరకు ఇండియన్ సినీ ప్రేక్షకులకు ఓటీటీ ల గురించి తెలిసింది చాలా తక్కువ.

ఓటీటీ లో కేవలం వెబ్‌ సిరీస్ లు వస్తాయి అనే అభిప్రాయం ఎక్కువ మందిలో ఉండేది.

చాలా క్లాస్ పీపుల్ కు మాత్రమే పరిమితం అయిన ఓటీటీ ఇప్పుడు దేశ వ్యాప్తంగా సామాన్యులకు కూడా అందుబాటులోకి వచ్చింది.

ఓ టీ టీ అనేది ఒక సాదారణ మాధ్యమంగా మారి పోయింది.ఇండియాలో అత్యధికులు అమెజాన్ ప్రైమ్‌ మరియు డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌ ను కలిగి ఉన్నారు అంటూ గతంలో ఒక సర్వే లో వెళ్లడి అయ్యింది.

కాని ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం అమెజాన్ తర్వాత స్థానం ను నెట్ ఫ్లిక్స్ ఆక్రమించే ప్రయత్నం చేస్తుందట.

హిందీ తో పాటు అన్ని స్థానిక భాష ల్లో కూడా సినిమా లను కోట్లకు కోట్లు పెట్టి కొనుగోలు చేసి స్ట్రీమింగ్‌ చేస్తున్న నెట్‌ ఫ్లిక్స్‌ ప్రస్తుతం దేశం లో అత్యధిక ఖాతాదారులను కలిగి ఉన్న ఓటీటీ గా నిలిచేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

ఆర్‌ ఆర్‌ ఆర్‌ సినిమా ను ఓటీటీ లో స్ట్రీమింగ్‌ చేయడం జరిగింది.

ఇప్పుడు ఆదిపురుష్ ను కూడా ఏకంగా 250 కోట్లకు గాను ఓటీటీ వారు స్ట్రీమింగ్‌ రైట్స్ ను కొనుగోలు చేయడం జరిగిందట.

అదే కాకుండా దాదాపుగా మూడు వేల కోట్లకు గాను రాబోయే ఏడాది కాలంలో సినిమా లను మరియు వెబ్‌ సిరీస్‌ లను కొనుగోలు చేయాలని నెట్‌ ఫ్లిక్స్ ఇండియా నిర్ణయించుకుందట.

"""/" / దాంతో అమెజాన్ పై ఖచ్చితంగా ఆధిపత్యం ను నెట్‌ ఫ్లిక్స్ అతి త్వరలోనే చెలాయించే అవకాశం ఉందంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సోషల్‌ మీడియా లో ఇప్పటికే నెట్‌ ఫ్లిక్స్ ను టాప్‌ ఓటీటీ గా ఇండియన్స్ లో ఎక్కువ శాతం పేర్కొంటున్నారు.

నెట్‌ ఫ్లిక్స్ నెలవారి చార్జీ ఎక్కువ అయినా కూడా ఏమాత్రం వెనకాడకుండా దాన్ని చూసేందుకు జనాలు ఎక్కువగా ఇంట్రెస్ట్‌ చూపిస్తున్నారు.

AP BJP : ఏపీ బీజేపీ అసెంబ్లీ అభ్యర్థుల జాబితాలో ట్విస్టులివే.. ఈ అభ్యర్థులకు గెలుపు సులువు కాదంటూ?