వైరల్ : సముద్ర తీరాన అద్భుత దృశ్యం..!
TeluguStop.com
ఈ మధ్య ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియాను బాగా ఫాలో అవుతున్నారు.
మనకు తెలియని ఎన్నో విషయాలను సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేస్తున్నారు.ఆ వీడియోలు నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నాయి.
జంతువులకు, పక్షులకు సంబంధించిన వీడియోలను అయితే వీక్షకులు బాగా ఇష్టపడుతున్నారు.ఆ వీడియోలను వైరల్ చేయడంతో పాటు షేర్స్, లైకులతో మారు మోగిస్తున్నారు.
ఈ క్రమంలోనే ఇప్పుడు ఒక పక్షుల గుంపుకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది.
ఆ వీడియో చూసిన ప్రతి నెటిజన్ కూడా ఆశ్చర్య పోకుండా ఉండలేరు.అసలు ఇంతకీ అది పక్షుల గుంపేనా లేక మారేదన్నానా అనే అనుమానం అందరిలో వస్తుంది.
సాధరణంగా పక్షులు ఎక్కడికన్నా వలస వెళ్ళాలి అనుకుంటే ఒక్కటి రెండుగా వెళ్లవు.ఒక గుంపులాగా, సమూహంలాగా మారి ఆకాశంలో ఎగురుతూ వెళ్తాయి.
మనం అప్పుడప్పుడు సాయంత్రం వేళ ఆకాశంలో ఇలా పక్షుల గుంపు ఎగరడాన్ని చూసే ఉంటాము.
భలే ఆహ్లదకరంగా ఉంటుంది ఆ దృశ్యం చూడడానికి.ఈ క్రమంలోనే ఒక పక్షుల సమూహం సముద్రం దగ్గర చేసిన విన్యాసాలు చూస్తే చూడ ముచ్చటగా ఉన్నాయి.
వాటిని చూస్తే ఆకాశం నుంచి భూమి పైకి వచ్చిన ఏలియన్సా అనే అనుమానం కలుగుతుంది.
ఏలియన్సా అని అనుకునే లోపే సర్పం లాగా మారిపోతాయి.ఇలా కేవలం కొన్ని క్షణాల్లోనే ఆ పక్షులు గుంపు వివిధ ఆకారాల్లోకి మారుతుండడం చూస్తే భలే విచిత్రంగా ఉంది.
ఈ అద్భుతమైన వీడియోను ఐపీఎస్ అధికారి రూప్లిన్ శర్మ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసారు.
సముద్ర టిరానా ఈ పక్షుల సందడి చూసిన ప్రతి నెటిజన్ కూడా వావ్ అనకుండా ఉండలేరు.
ఇంత అందమైన వీడియోను ఎక్కడ చూడలేదు అని ఒకరు అంటే.ఈ పక్షుల విన్యాసాలు చూస్తుంటే మనసుకి ఎంతో సంతోషంగా ఉందని మరొక నెటిజన్ కామెంట్స్ చేస్తున్నారు.
మరి ఈ వీడియోను మీరు కూడా ఒక లుక్ వేసేయండి.
పుష్ప ది రూల్ మూవీ 22 రోజుల కలెక్షన్ల లెక్కలివే.. దేవరకు మూడు రెట్లు.. కానీ?