భద్రాచలం సుదర్శన చక్ర మహిమ ఏమిటో మీకు తెలుసా?

తెలుగువారు ఎంతో భక్తిభావంతో పూజించేవారిలో శ్రీరామచంద్రుడు ఒకరు.భద్రాచలంలో గోదావరి నది తీరాన వెలిసిన రాములవారి ఆలయం ఎంతో ప్రత్యేకమైనది.

రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందినది.ఈ ఆలయంలో సీతారామలక్ష్మణులు కొలువై ఉండి భక్తుల కోరికలను నెరవేర్చే దేవుడిగా ప్రసిద్ధి చెందారు.

పురాణాల ప్రకారం ఈ ఆలయాన్ని రామదాసు నిర్మించాడని చెబుతారు.అయితే ఈ ఆలయం పై ఉన్న సుదర్శన చక్రం మానవ నిర్మితం కాదని, అది దేవతా నిర్మితమైందని పురాణాలు చెబుతున్నాయి.

ఈ ఆలయంపై సుదర్శన చక్రం ఏ విధంగా ఏర్పడింది? దాని మహిమ ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.

శ్రీ రామదాసు ఆలయం నిర్మించే సమయంలో అప్పటి పాలనలో ఉన్న తురుష్కులు వారి అనుమతి లేకుండా ఆలయం నిర్మించినందుకు రామదాసును కారాగారంలో ఉంచారు.

దీంతో ఆలయం చివరిభాగం సుదర్శన చక్రం మిగిలిపోయింది.రామదాసు కారాగారంలో ఉండగానే అప్పటి ఆలయ పాలకులు వేరే కలశం అక్కడ ఉంచగా అది ప్రతి చిన్నపాటి గాలికి, వర్షానికి చిన్న పడితూ అపచారం జరిగేది.

దీంతో కలవరం చెందిన స్థానికులు ఈ విషయాన్ని కారాగారంలో ఉన్న రామదాసుకు చేరవేశారు.

"""/"/ కొద్ది రోజుల అనంతరం కారాగారం నుంచి బయటకు వచ్చిన రామదాసుకు ఒకరోజు కలలో శ్రీ రాముల వారు ప్రత్యక్షమై ఆ ఆలయ శిఖరం పై పెట్టవలసిన సుదర్శన చక్రం ఎక్కడ ఉందొ చెప్పారు.

పవిత్ర గోదావరి నదిలో లభిస్తుందని చెప్పి మాయమయ్యారు.మరుసటి రోజు ఉదయం రామదాసు ఈ విషయం అందరికీ చెప్పి గోదావరిలో స్నానాకి వెళ్లి నీటిలో మునిగి పైకి లేవగానే ఆయన చేతిలో ఇప్పుడు మీరు చూస్తున్న సుదర్శన చక్ర సహిత పెరుమాళ్లు రెండు చేతులపై తెలియాడుతూ కనిపించాయి.

సుదర్శన చక్రం లభించిన ఆనందంలో శ్రీ రామదాసు అదే రోజు పెద్ద ఎత్తున వేదమంత్రాల నడుమ ఆలయం పైభాగంలో సుదర్శన చక్రాన్ని ప్రతిష్టించారు.

అప్పటి నుంచి ఒక్కసారి కూడా సుదర్శన చక్రం కింద పడకుండా ఉందని పురాణాలు చెబుతున్నాయి.

నిజామాబాద్‌ జిల్లాకు బిజెపి, బిఅర్‌ఎస్‌ పార్టీలు చేసింది శూన్యం : ధర్మపురి సంజయ్