నేలపై కూర్చోవడం వల్ల ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు!
TeluguStop.com

ఒకప్పుడు అందరూ నేలపైనే కూర్చుని ముచ్చట్లు చెప్పుకొనేవారు.నేలపై కూర్చుని ( Floor Sitting )అన్ని పనులు చేసుకునేవారు.


కానీ ఇప్పుడు కుర్చీలు సోఫాలు వచ్చాయి.దాదాపు ప్రతి ఒక్కరూ కుర్చీలు సోఫాల్లోనే రోజులో సగానికి పైగా జీవితాన్ని గడిపేస్తున్నారు.


ల్యాప్ టాప్ ముందు వర్క్ చేసిన, సరదాగా టీవీ చూసిన లేక భోజనం చేసిన కుర్చీలు, సోఫాల్లోనే కానిస్తున్నారు.
ఈ జాబితాలో మీరు ఉన్నారా.? అయితే ఇకపై రోజులో కనీసం అరగంట లేదా గంట అయినా నేలపై కూర్చునేందుకు ప్రయత్నించండి.
"""/" /
ఎందుకంటే నేలపై కూర్చోవడం వల్ల ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి.
అవి తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు.మరి ఇంకెందుకు ఆలస్యం నేలపై కూర్చోవడం వల్ల ఏయే ప్రయోజనాలు పొందవచ్చు అనేది తెలుసుకుందాం పదండి.
వెన్ను నొప్పి( Back Pain )తో బాధపడుతున్న వారు నేలపై కూర్చోడం ఎంతో ప్రయోజనకరం.
నేలపై కూర్చోవడం వల్ల వెన్నెముక నిటారుగా ఉంటుంది.తద్వారా వెన్ను నొప్పి సమస్య తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు.
కాబట్టి వెన్ను నొప్పితో బాధపడుతున్న వారు నేలపై కూర్చోవడానికి ప్రయత్నించండి.అలాగే నేలపై కూర్చోవడం వల్ల తుంటి కండరాలను బలోపేతం అవుతాయి.
నేల మీద కూర్చోవడం వల్ల వెన్నెముక దాని షేప్‌లో ఉంటుంది.కూర్చునే భంగిమను కూడా మెరుగుపరుస్తుంది.
అలాగే బాగా ఒత్తిడికి లోనైనప్పుడు కాసేపు ఒంటరిగా నేలపై కూర్చుని ఉండాలి.నేలపై కూర్చోవడం వల్ల మెదడుపై సైతం ప్రభావం చూపుతుంది.
మానసిక స్థిరత్వాన్ని పొందుతారు.ఒత్తిడి( Stress ), ఆందోళన, చిరాకు వంటి మానసిక సమస్యలు దూరం అవుతాయి.
"""/" /
కొన్ని నిమిషాలు నేలపై కూర్చోవడం వల్ల శరీరం శక్తివంతంగా మారుతుందని కూడా ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
కాబట్టి ఇకపై కుర్చీలు, సోఫాలకు అతుక్కుపోకుండా రోజులో కాసేపు అయినా నేలపై కూర్చునేందుకు ప్రయత్నించండి.
అయితే నేలపై కూర్చున్నప్పుడు సుఖాసన భంగిమలో కూర్చోవాలి.వంగి అస్సలు కూర్చోవద్దు.
నేలపై కూర్చోవడం కష్టంగా అనిపిస్తే మొదట్లో కాళ్లను ముందుకు చాచి కూడా కూర్చోవచ్చు.
అద్దె విషయంలో వివాదం.. ఎన్ఆర్ఐ మహిళని సజీవదహనం చేసిన బాలుడు