గుమ్మడికాయ విత్తనాలు తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో తెలుసా?
TeluguStop.com
గుమ్మడికాయ కూర అంటే ఇష్టపడని వారు ఉండరు.అలాగే గుమ్మడికాయ కోసినప్పుడు
విత్తనాలు ఉంటాయి.
వాటిని చాలా మంది తొక్క ఒలుచుకొని తింటూ ఉంటారు.అయితే
కొంతమంది ఆ విత్తనాలను పాడేస్తారు.
అయితే వాటిలో ఉన్న ఆరోగ్య ప్రయోజనాల
గురించి తెలిస్తే పాడేయకుండా తింటారు.ఇప్పుడు వాటి గురించి వివరంగా
తెలుసుకుందాం.
గుమ్మడికాయ విత్తనాలలో అర్గినైన్ అనే సమ్మేళనం సమృద్ధిగా ఉండుట వలన రక్తం
గడ్డకట్టకుండా చూస్తుంది.
అంతేకాక రక్తంలో కొవ్వు చేరకుండా గుండెను
కాపాడుతుంది.అలాగే ఈ విత్తనాలలో ఉండే నైట్రిక్ ఆక్సైడ్ రక్త నాళాల
స్థితిస్థాపకతను పెంచుతుంది.
దాంతో గుండె జబ్బులు వచ్చే అవకాశాలు
తగ్గిపోతాయి. Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px""/" /
గుమ్మడికాయ విత్తనాలలో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్,విటమిన్ ఇ,
ఫీనోలిక్ సమ్మేళనాలు, జింక్ సమృద్ధిగా ఉండుట వలన శరీరంలో కణజాలాన్ని
రక్షిస్తాయి.
అంతేకాక శరీర పోషణ మరియు శరీర నిర్మాణంలో కీలకమైన పాత్రను
పోషిస్తాయి.!--nextpage
మధుమేహం ఉన్నవారు ప్రతి రోజు తింటే మధుమేహం అదుపులో ఉంటుంది.
గుమ్మడికాయ
విత్తనాలలో ట్రైగోనిలైన్, నికోటినిక్ యాసిడ్, డి-కైరో-ఐనాసిటాల్ అనే
సమ్మేళనాలు సమృద్ధిగా ఉండుట వలన రక్తంలో చక్కర స్థాయిలను నియంత్రిస్తాయి.
అధిక బరువును తగ్గించడంలోనూ గుమ్మడికాయ విత్తనాలు మేలు చేస్తాయి.ఫైబర్
అధికంగా ఉండడం వల్ల ఈ విత్తనాలను తింటే ఆకలి అదుపులో ఉంటుంది.
దీని వల్ల
అధిక బరువును తగ్గించుకోవచ్చు.గుమ్మడికాయ విత్తనాలలో ఒమెగా 3, ఒమెగా 6 ఫ్యాటీ యాసిడ్లు సమృద్ధిగా ఉండుట
వలన జీర్ణాశయంలో హానికర బ్యాక్టీరియాను నాశనం చేస్తాయి.
అలాగే
చర్మానికి,జుట్టు పోషణకు సహాయపడుతుంది.
వైరల్ వీడియో.. ఇందుకే కాదయ్యా నిన్ను ‘క్రికెట్ దేవుడు’ అనింది!