మోసాంబి జ్యూస్ తాగడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసా..?

ప్రస్తుతం పండ్ల మార్కెట్లలో మోసాంబి( Mosambi ) ని కూడా అమ్ముతున్నారు.ఇది కేవలం పేషెంట్లు తాగాల్సిన డ్రింక్ అనుకుంటే మాత్రం పొరపాటే.

పిల్లలు, వృద్దులతో సహా వివిధ వయసుల వారి ఆహారంలో ఈ పండు రసాన్ని చేర్చుకోవచ్చు.

షాపులలో సులభంగా ఈ జ్యూస్ లభిస్తుంది.కానీ మంచి క్వాలిటీ ఉండాలంటే మాత్రం ఇంట్లో రసం తయారు చేసుకోవడం మంచిది అని వైద్య నిపుణులు చెబుతున్నారు.

ఇందులో విటమిన్ ఏ, విటమిన్ సి, పాస్ఫరస్, పొటాషియం, కార్బోహైడ్రేట్లు ఉన్నాయి.యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ అల్సర్ గుణాల కోసం ముసాంబి రసాన్ని తప్పనిసరిగా ఆహారంలో చేర్చుకోవాలి అని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.

"""/" / కాలానుగుణ మార్పుల సమయంలో మీ రోగ నిరోధక శక్తి( Immunity Power )ని పెంచడానికి మోసాంబి రసం తీసుకోవడం ఎంతో మంచిది.

సీజన్ మారినప్పుడు వచ్చే సాధారణ వ్యాధుల నుంచి ముసాంబీ రసం మిమ్మల్ని దూరంగా ఉంచుతుంది.

అంతే కాకుండా శరీరాన్ని నిర్విషీకరణ చేయడానికి మోసాంబి రసానికి సాటి లేదు.ఒత్తిడి, కాలుష్యం వంటి వివిధ కారణాల వల్ల శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్స్ ను మోసాంబి రసం( Mosambi Juice ) తొలగిస్తుంది.

అంతే కాకుండా సిట్రిక్ యాసిడ్ ఎక్కువగా ఉండే మోసాంబి రసం జీవక్రియను పెంచడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది.

కాబట్టి డైటింగ్ చేసే వారు తప్పనిసరిగా ఈ పండ్ల రసాన్ని త్రాగుతూ ఉండాలి.

"""/" / ఈ హైడ్రేటింగ్, ఫైబర్ నిండిన పానీయం కడుపు నిండుగా ఉంచుతుంది.

తరచుగా ఆకలి బాధలు దూరం అవుతాయి.ఇంకా చెప్పాలంటే మోసాంబి జ్యూస్ లో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బయోటిక్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి.

కాబట్టి చర్మ ఆరోగ్యం( Skin Glow ) మెరుగుపడుతుంది.ఈ రసంలోని సహజ గుణాల వల్ల చర్మంలోని మలినాలు అన్ని తొలగిపోతాయి.

పొట్ట సమస్యలను దూరం చేస్తుంది.కాబట్టి ఈ రసాన్ని సీజన్ కి అనుకూలంగా తీసుకుంటూ ఉండాలి.

ఇలా చేయడం వల్ల సీజనల్ వ్యాధులు దరిచేరకుండా ఉంటాయి.

ఓరి నాయనో.. ఈ అవ్వ మజిల్స్ చూస్తే మతిపోతుంది..?