ఈ అనారోగ్య సమస్యలు ఉన్నవారు బెండకాయ జోలికి అసలు వెళ్ళకూడదు..!

సాధారణంగా తాజా కాయగూరలు ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడతాయి.కానీ కొన్ని రకాల వ్యాధులతో బాధపడుతున్న వారు కొన్ని రకాల కాయగూరలు అసలు తినకూడదు.

అయితే ఏలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నవారు బెండకాయలు తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.బెండకాయని కూరగా చేసుకుని తిన్నా, బెండకాయ( Ladies Finger ) వాటర్ తాగిన శరీరానికి ఎంతో మంచిది.

అందులోనూ ఆకుపచ్చ రంగు కాయగూరలు ఆరోగ్యానికి మరింత మంచిదన నిపుణులు చెబుతున్నారు. """/" / అయితే కొన్ని రకాల వ్యాధులు ఉన్నవారికి బెండకాయ ఇంకా అనారోగ్య సమస్యలను పెంచుతుంది.

అందుకే ఏ సమస్యలు ఉన్నవారు బెండకాయ తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.రక్తం గడ్డ కట్టే సమస్యలు ఉన్నవారు,దీని కోసం ఔషధాలను ఉపయోగించేవారు వైద్యుల సలహా తీసుకొని మాత్రమే బెండకాయను తినాలి.

ఎందుకంటే బెండకాయ రక్తం గడ్డ కట్టడంలో కీలకపాత్ర పోషిస్తుంది.ఇందులో విటమిన్ K ఎక్కువగా ఉంటుంది.

అలాగే చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉన్నవారు బెండకాయ ఉడికించిన కూరలు తినడం మంచిది.

బెండకాయ ఫ్రై అనేది ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. """/" / ఎందుకంటే బెండకాయలో ఉండే జిగట పోవడానికి చాలా ఎక్కువ మోతాదులో నూనె ఉపయోగించాల్సి వస్తుంది.

దాని వల్ల ఆరోగ్యం ప్రమాదంలో పడుతుంది.డయాబెటిస్( Diabetes ) తో బాధపడేవారు కూడా బెండకాయను అతిగా తినకూడదు.

అలాగే కిడ్నీ స్టోన్స్ సంబంధిత సమస్యలు ఉన్నవారు ఈ ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.

నిజానికి ఈ సమస్య ఉన్నవారు పూర్తిగా బెండకాయను తినకపోవడమే మంచిది.అలాగే కడుపులో గ్యాస్( Gastric Problem ), ఉబ్బరం, విరోచనాలు, జీర్ణ వ్యవస్థ సమస్యలు ఉన్నవారు కూడా బెండకాయలను పొరపాటుగా కూడా తినకూడదు.

అలాగే సాధారణ ఎలర్జీ సమస్య ఉన్నవారు కూడా బెండకాయలను అస్సలు తినకూడదు.చాలామందికి మందార పువ్వు వంటివి ఎలర్జీని కలిగిస్తాయి.

అలాంటివారు బెండకాయను తినకూడదని నిపుణులు చెబుతున్నారు.అలాగే మూత్రపిండాలు, పిత్తాశయంలో రాళ్లు ఉన్నవారికి బెండకాయ తినడం అనేది కొత్త సమస్యను సృష్టించే అవకాశం ఉంది.

అలాగే జీర్ణవ్యవస్థ బలహీనంగా ఉన్నవారు, దగ్గు, సైనస్ వంటి సమస్యలు ఉన్నవారు కూడా బెండకాయకు దూరంగా ఉండడమే మంచిది.

అమెరికాలో మరో తెలుగు విద్యార్ధి మృతి.. భయాందోళనలో తల్లిదండ్రులు