కాజు మిల్క్‌.. ఆరోగ్యానికి, అందానికి ఎన్ని ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తుందో తెలుసా?

కాజు మిల్క్ లేదా జీడిప‌ప్పు పాలు.ఎంతో రుచిగా ఉండట‌మే కాదు ఆరోగ్య ప‌రంగా, సౌంద‌ర్య ప‌రంగా బోలెడ‌న్ని ప్ర‌యోజ‌నాల‌ను సైతం క‌లిగిస్తాయి.

పిల్ల‌లు, పెద్ద‌లు అనే తేడా లేకుండా ఎవ్వ‌రైనా ఈ కాజు మిల్క్‌ను తీసుకోవ‌చ్చు.

మ‌రి ఇంత‌కీ కాజు మిల్క్‌ను ఎలా తాయారు చేసుకోవాలి.? అస‌లు కాజు మిల్క్ తీసుకోవ‌డం వ‌ల్ల ల‌భించే ప్ర‌యోజ‌నాలు ఏంటీ.

? వంటి విష‌యాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులో నాలుగు లేదా ఐదు జీడిప‌ప్పులు, చిన్న క‌ప్పుడు పాలు వేసి క‌నీసం మూడు గంట‌ల పాటు నాన బెట్టుకోవాలి.

ఆ త‌ర్వాత మిక్సీ జార్‌లో పాల‌తో స‌హా జీడి ప‌ప్పుల‌ను వేసి మెత్త‌గా గ్రౌండ్ చేసుకోవాలి.

ఇప్పుడు స్ట‌వ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో గ్లాస్ కొవ్వు తీసిన పాల‌ను పోయాలి.

పాలు కాస్త హీట్ అవ్వ‌గానే అందులో గ్రౌండ్ చేసి పెట్టుకున్న‌ జీడి ప‌ప్పు మిశ్ర‌మాన్ని వేసి.

స్లో ఫ్లేమ్‌పై ప‌ది నిమిషాల పాటు మ‌రిగించాలి.చివ‌రిగా ఒక స్పూన్ బెల్లం వేసి బాగా క‌లిపి స్ట‌వ్ ఆఫ్ చేస్తే.

కాజు మిల్క్ సిద్ధ‌మైన‌ట్టే.ఉద‌యం పూట ఈ టేస్టీ కాజు మిల్క్‌ను తాగితే మెద‌డు మునుప‌టి కంటే చురుగ్గా మారుతుంది.

జ్ఞాప‌క శ‌క్తి రెట్టింపు అవుతుంది.ఎముక‌లు, దంతాలు, కండ‌రాలు బ‌లంగా మార‌తాయి.

"""/"/ నిద్ర లేమి స‌మ‌స్య ఉంటే దూరం అవుతుంది.శ‌రీరంలో క్యాన్స‌ర్ క‌ణాలు వృద్ధి చెంద కుండా ఉంటాయి.

డిప్రెష‌న్‌, ఒత్తిడి వంటి మాన‌సిక వ్యాధులు త‌గ్గు ముఖం ప‌డ‌తాయి.వృద్ధాప్య ఛాయ‌లు త్వ‌ర‌గా రాకుండా ఉంటాయి.

స్కిన్ టోన్ పెరుగుతుంది.చ‌ర్మం ఎల్ల‌ప్పుడూ య‌వ్వ‌నంగా మెరుస్తుంది.

హెయిర్ ఫాల్‌ స‌మ‌స్య సైతం క్ర‌మంగా త‌గ్గిపోతుంది.

హరితేజ అందాల ప్రదర్శన చూసి ఆశ్చర్యపోతున్న నెటిజన్లు.. భారీ షాకిచ్చారంటూ?