వేసవిలో ఒంటికి చలువ చేసే జొన్న జావ.. రోజూ తీసుకుంటే మరిన్ని బెనిఫిట్స్!
TeluguStop.com
వేసవికాలం రానే వచ్చింది.ఉదయం 9 గంటల నుంచే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు.
నిన్న మొన్నటి వరకు ప్రజలు చలికి వణికిపోయారు.ఇప్పుడు వేసవి వేడికి ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.
ఇకపోతే వేసవి కాలంలో దాదాపు ప్రతి ఒక్కరి శరీర ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతాయి.
అందుకే ఒంట్లో వేడిని తగ్గించుకునేందుకు ప్రతి ఒక్కరూ ప్రయత్నిస్తుంటారు.ఒంటికి చలువ చేసే ఆహారాలు డైట్ లో చేర్చుకుంటారు.
అయితే అటువంటి ఫుడ్స్ లో జొన్న జావ( Jonna Java ) కూడా ఒకటి.
సాధారణంగా చాలా మంది వేసవిలో ఉదయాన్నే రాగి జావను తీసుకుంటూ ఉంటారు.కానీ రాగి జావ మాత్రమే కాదు జొన్న జావకు కూడా బాడీని కూల్‌గా మార్చే సామర్థ్యం ఉంది.
పైగా జొన్న జావ ఆరోగ్యానికి మరెన్నో ప్రయోజనాలను సైతం చేకూరుస్తుంది. """/" /
సమ్మర్ లో రోజు ఉదయాన్నే ఒక గ్లాసు జొన్న జావ తీసుకోవడం వల్ల శరీరంలో అధిక వేడి మొత్తం తొలగిపోతుంది.
జొన్న జావ మన బాడీకి చల్లదనాన్ని అందిస్తుంది.వేసవి తాపం నుంచి బయటపడడానికి సహాయపడుతుంది.
అలాగే వేసవికాలంలో ఎంతో మంది డీహైడ్రేషన్ బారిన పడుతుంటారు.ఈ రిస్క్ ను తగ్గించడానికి జొన్న జావ తోడ్పడుతుంది.
సమ్మర్ లో నిత్యం జొన్న జావను తీసుకుంటే బాడీలో నీటి నిల్వలు తగ్గకుండా ఉంటాయి.
శరీరం హైడ్రేటెడ్ గా ఉంటుంది.వేసవి వేడిని తట్టుకునే సామర్థ్యం లభిస్తుంది.