రెగ్యుల‌ర్‌గా గ‌రం మ‌సాలా తీసుకుంటే..ఆ జ‌బ్బులు దరిచేర‌వ‌ట‌?!

గ‌రం మ‌సాలా.భార‌తీయులు వంట‌ల్లో విరి విరి ఉప‌యోగించే వాటిలో ఇదీ ఒక‌టి.

ఘాటైన రుచి, ప్ర‌త్యేక‌మైన సువాస‌న క‌లిగి ఉండే గ‌రం మ‌సాలాను జీలకర్ర, దాల్చిన చెక్క, ధ‌నియాలు, లవంగాలు, యాలకులు, మిరియాలు, సోంపు, కరక్కాయ, జాజికాయ‌ లాంటి సుగంధ ద్రవ్యాలతో త‌యారు చేస్తుంది.

అందుకే వంట‌ల‌కు గ‌రం మసాలా అద్భుమైన ఫ్లేవ‌ర్‌ను అందిస్తుంది.ఇక ఆరోగ్య ప‌రంగానూ గ‌రం మ‌సాలా ఎంతో మేలు చేస్తుంది.

గ‌రం మ‌సాలాను రెగ్యుల‌ర్‌గా త‌గిన మోతాదులో తీసుకుంటే అనేక జ‌బ్బులు ద‌రి చేర‌కుండా ఉంటాయి.

మ‌రి ఆల‌స్యం చేయ‌డ‌కుండా గ‌రం మ‌సాలా యొక్క ప్ర‌యోజ‌నాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

సాధార‌ణంగా ర‌క్తంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగే కొద్ది గుండె జ‌బ్బులు వ‌చ్చే రిస్క్ పెరుగుతుంది.

అయితే ప్ర‌తి రోజు గ‌రం మ‌సాలాను ఏదో ఒక రూపంలో తీసుకుంటే గ‌నుక‌ బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గుతుంది.

దాంతో గుండె ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. """/" / నోటి దుర్వాసనతో బాధ ప‌డే వారు ఖ‌చ్చితంగా గ‌రం మ‌సాలాను డైట్‌లో చేర్చుకోవాలి.

ఎందుకంటే, గ‌రం మ‌సాలాలో ఉండే ప‌లు పోష‌కాలు చెడ్డ శ్వాసతో పోరాడి నోటి దుర్వాస‌న స‌మ‌స్య‌ను నివారిస్తుంది.

ప్ర‌తి రోజు త‌గిన మోతాదులో గ‌రం మ‌సాలాను తీసుకుంటే జీర్ణ వ్య‌వ‌స్థ ప‌ని తీరు మెరుగు ప‌డుతుంది.

గ్యాస్, ఎసిడిటీ, క‌డుపు ఉబ్బ‌రం, క‌డుపు నొప్పి, మ‌ల‌బ‌ద్ధ‌కం వంటి స‌మ‌స్యలు ద‌రి చేర‌కుండా ఉంటాయి.

"""/" / అలాగే చాలా మంది క‌ళ్ల వాపుల‌తో బాధ ప‌డుతుంటారు.అలాంటి వారు గ‌రం మ‌సాలాను రెగ్యుల‌ర్‌గా తీసుకుంటే వాపుల నుంచి ఉప‌శ‌మ‌నం పొందుతారు.

అంతేకాదు, గ‌రం మ‌సాలాను తీసుకోవ‌డం వ‌ల్ల ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు అదుప‌లో ఉంటాయి.

క్యాన్స‌ర్ వ‌చ్చే ప్ర‌మాదం త‌గుతుంది.చ‌ర్మం ఎల్ల‌ప్పుడూ య‌వ్వ‌నంగా మ‌రియు కాంతివంతంగా ఉంటుంది.

అయితే గుర్తించుకోవాల్సిన విష‌యం ఏంటంటే.ఆరోగ్యానికి మంచిది క‌దా అని గ‌రం మ‌సాలాను అతిగా మాత్రం తీసుకోరాదు.

పిల్లల కోసం అమెరికన్ తల్లి చేసే ఇండియన్ వంటలు చూస్తే నోరూరిపోతుంది!