వారానికోసారి ఉప‌వాసం చేస్తే..ఏం అవుతుందో తెలుసా?

ఆషాడ మాసం వెళ్లి శ్రావ‌ణ‌మాసం రానే వ‌చ్చింది.సకలదేవతలకు ప్రీతికరమైన ఈ శ్రావణమాసంలో చాలా మంది స్త్రీలు భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో, నియ‌మ నిష్ట‌ల‌తో పూజలు చేస్తుంటారు.

అలాగే వారానికి క‌నీసం ఒక సారి అయినా ఉప‌వాసం చేస్తుంటారు.అయితే భ‌క్తితో చేసిన‌ప్ప‌టికీ.

ఉప‌వానం చేయ‌డం వ‌ల్ల ఆరోగ్యానికీ అనేక ప్ర‌యోజ‌నాలు ల‌భిస్తాయ‌ని అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

మ‌రి ఉప‌వాసం వ‌ల్ల వ‌చ్చే ఆ హెల్త్ బెనిఫిట్స్ ఏంటో లేట్ చేయ‌కుండా ఇప్పుడు తెలుసుకుందాం.

వారానికి ఒక సారి ఉప‌వాసం చేస్తే ర‌క్తంలోని చెడు కొలెస్ట్రాల్ క‌రుగుతుంది.

దాంతో గుండె పోటు మ‌రియు ఇత‌ర గుండె సంబంధిత జ‌బ్బులు ద‌రి చేర‌కుండా ఉంటాయి.

అలాగే ప్ర‌తి రోజు తిన‌డం వ‌ల్ల జీర్ణ వ్య‌వ‌స్థ తీవ్రంగా అల‌సి పోతుంటుంది.

అయితే ఉప‌వాస‌రం చేయ‌డం వ‌ల్ల‌ జీర్ణ వ్య‌వ‌స్థ కాస్త రెస్ట్ తీసుకుని మ‌రింత చురుగ్గా మారుతుంది.

దాంతో గ్యాస్‌, ఎసిడిటీ, అజీర్తి, మ‌ల‌బ‌ద్ధ‌కం వంటి జీర్ణ సంబంధిత స‌మ‌స్య‌ల‌కు దూరంగా ఉండొచ్చు.

"""/" / బ‌రువు త‌గ్గాలి అని ప్ర‌య‌త్నిస్తున్న వారు కూడా వారానికోసారి ఉప‌వాసం చేస్తే శ‌రీరంలో అద‌నంగా పేరుకు పోయిన ప్యాట్ క్ర‌మంగా త‌గ్గిపోతుంది.

దాంతో మీరు వెయిట్ లాస్ అవుతారు.ఉప‌వాసం చేసే స‌మ‌యంలో వాట‌ర్‌ను ఎక్కువ‌గా తీసుకుంటారు.

అలా చేయ‌డం వ‌ల్ల మెద‌డు ప‌ని తీరు మెరుగు ప‌డుతుంది.ఫ‌లితంగా ఆలోచ‌నా శ‌క్తి, జ్ఞాపకశక్తి రెండూ అద్భుతంగా పెరుగుతాయి.

"""/" / ఇక వారానికి ఒక సారి ఉప‌వానం చేయ‌డం వ‌ల్ల‌.రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ స్ట్రోంగ్‌గా మారుతుంది.

ఒత్తిడి, ఆందోళన, నిద్రలేమి వంటి స‌మ‌స్య‌లు ప‌రార్ అవుతాయి.మ‌న‌సుకు ప్ర‌శాంత‌త ల‌భిస్తుంది.

ర‌క్త పోటు కంట్రోల్‌లో ఉంటుంది.కాన్సర్ కణాలు వృద్ధి చెందకుండా ఉంటాయి.

శ‌రీరంలోని వ్య‌ర్థాలు బ‌య‌ట‌కు పోతాయి.చ‌ర్మం కూడా ఎంతో కాంతివంతంగా మారుతుంది.

బన్నీ కారణంగా ఇండస్ట్రీ మొత్తం తలవంచింది.. ఫైర్ అయిన తమ్మారెడ్డి?