నువ్వులను తరచుగా తీసుకోవడం ద్వారా ఎలాంటి ఉపయోగాలంటే..!
TeluguStop.com
సాధారణంగా నువ్వులని మన భారతీయ వంటల్లో వాడుతూ ఉంటాము కదా.అలాగే నువ్వులు వాడడం వలన ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి.
అయితే చాలామంది నువ్వులు తినడం వలన వేడి చేస్తుంది అని అంటూ ఉంటారు.
కానీ, నువ్వులు తీసుకోవడం అనేది మన ఆరోగ్యానికి చాలా మంచిది.అప్పట్లో నువ్వులను బెల్లముతో కలిపి నువ్వులు ఉండలు లాగా చేసుకుని తింటే ఎంతో ఆరోగ్యం.
అయితే నిజంగా వీటి వలన అన్నీ రకాల ప్రయోజనాలు ఉన్నాయా.? అంటే ఉన్నాయి అనే అంటారు ఆరోగ్య నిపుణులు.
నువ్వులతో చేసిన వంటలు శరీరానికి చాలా బలాన్ని ఇస్తాయి.అలాగే నువ్వుల్లో ఇనుము శాతం కూడా అధికంగా ఉంటుంది.
కనుక ప్రతిరోజు నువ్వులను ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల రక్తహీనత సమస్య తగ్గుతుంది.
అలానే తరచూ నీరసంతో బాధ పడేవాళ్ళు నువ్వుల ఉండలను తింటే తక్షణ శక్తి వస్తుంది.
నువ్వులు, బెల్లం రెండు కలిపి ఉండలు చేసుకుని రోజుకి ఒక ఉండ తింటే చాలా మంచిది.
పిల్లలు, పెద్దలు ఇలా వయసు భేదం లేకుండా అందరూ వీటిని తినవచ్చు.నువ్వుల్లోనూ, బెల్లంలోనూ కూడా ఇనుము శాతం అధికంగా ఉంటుంది.
అలానే హైబీపీతో బాధపడే వారు నువ్వుల నూనె తో చేసిన వంటలు తింటే అధిక రక్తపోటును అదుపులో ఉంచుకోవచ్చు.
"""/"/
నువ్వుల్లో అమినోయాసిడ్ లు, మాంస కృత్తులు పుష్కలంగా ఉంటాయి.అంతేకాదండి నువ్వులు రక్తంలోని చక్కెర స్థాయిలను కూడా అదుపు చేస్తాయి.
దీని వల్ల ఉబ్బసం వ్యాధి నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.వీటిలో ఉండే సెసమాల్ అనే యాంటీ ఆక్సిడెంట్ గుండె వ్యాధుల నుంచి కాపాడుతుంది.
కాబట్టి బయట ఫుడ్ తినేకంటే రోజుకి ఒక్క నువ్వుల ఉండ తింటే చాలు.
మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి.
ఇండియాలో సౌత్ దర్శకుల హవా ఎక్కువగా కొనసాగుతుందా..?