గుండె జ‌బ్బుల ప్ర‌మాదాన్ని త‌గ్గించే జనపనార గింజ‌లు.. నిత్యం తీసుకుంటే మ‌రెన్నో లాభాలు!

జనపనార గింజ‌లు.( Hemp Seeds ) ఇంగ్లీష్‌లో వీటిని హెంప్ సీడ్స్ అని పిలుస్తారు.

జనపనార గింజలు పోషకమైనవి మరియు ఆరోగ్యకరమైనవి.చూడ‌టానికి చిన్న ప‌రిమాణంలో ఉన్నప్ప‌టికీ జ‌న‌ప‌నార గింజ‌ల్లో పొటాషియం, సోడియం, మెగ్నీషియం, సల్ఫర్, కాల్షియం, ఇనుము, జింక్, భాస్వరం వంటి ఖ‌నిజాల‌తో పాటు విటమిన్ ఇ, ప్రోటీన్, ఫైబ‌ర్‌, ఒమేగా-3, ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్స్ పుష్క‌లంగా ఉంటాయి.

అందువ‌ల్ల ఆరోగ్య ప‌రంగా జ‌న‌ప‌నార గింజ‌లు అనేక ప్ర‌యోజ‌నాల‌ను చేకూరుస్తాయి.ప్ర‌ధానంగా గుండె జ‌బ్బుల ప్ర‌మాదాన్ని( Heart Diseases ) త‌గ్గించే సామ‌ర్థ్యం జ‌న‌ప‌నార గింజ‌ల‌కు ఉంది.

అవును జ‌న‌ప‌నార గింజ‌లు అధిక మొత్తంలో అమినో యాసిడ్ అర్జినైన్ ను క‌లిగి ఉంటుంది.

ఇది మీ శరీరంలో నైట్రిక్ ఆక్సైడ్‌ను ఉత్పత్తి చేసి రక్తపోటును అదుపులో ఉంచుతుంది.

గుండె జబ్బులు వ‌చ్చే రిస్క్ ను త‌గ్గిస్తుంది.అలాగే జనపనార గింజ‌లు ప్రోటీన్ యొక్క అద్భుతమైన మూలం.

అందువ‌ల్ల దృఢ‌మైన కండ‌రాల నిర్మాణానికి ఈ గింజ‌లు ఉత్త‌మంగా తోడ్ప‌డ‌తాయి. """/" / జనపనార గింజ‌ల్లో కరిగే మరియు కరగని ఫైబర్ రెండూ ఉంటాయి.

కరిగే ఫైబర్ శరీరంలోని చెడు కొలెస్ట్రాల్( Bad Cholestrol ) స్థాయిలను తగ్గిస్తుంది.

కరగని ఫైబర్ జీర్ణ వ్య‌వ‌స్థ ప‌నితీరును పెంచుతుంది.మలబద్ధకం, గ్యాస్‌, అజీర్తి వంటి జీర్ణ‌ సమస్యలు మీ ద‌రిదాపుల్లోకి రాకుండా అడ్డుకుంటుంది.

వివిధ రకాల క్యాన్సర్లకు చెక్ పెట్టే సామ‌ర్థ్యం జ‌న‌ప‌నార గింజ‌ల‌కు ఉంది.క్యాన్స‌ర్ కు కార‌ణ‌మ‌య్యే ఫ్రీ రాడికల్స్ ను జ‌న‌ప‌నార విత్త‌నాలు నాశ‌నం చేస్తాయి.

"""/" / అంతేకాదు, జ‌న‌ప‌నార గింజ‌ల‌ను నిత్యం తీసుకోవ‌డం వ‌ల్ల మెట‌బాలిజం రేటు( Metabolism Rate ) పెరుగుతుంది.

శ‌రీర బ‌రువు అదుపులో ఉంటుంది.ఎముక‌లు బ‌లోపేతం అవుతాయి.

బోలు ఎముకల వ్యాధి వ‌చ్చే ప్ర‌మాదం త‌గ్గుతుంది.మ‌రియు రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ సైతం పటిష్ఠంగా మారుతుంది.

ఇక జ‌న‌ప‌నార గింజ‌ల‌ను ఏయే విధాలుగా తీసుకోవ‌చ్చు అంటే.తృణధాన్యాలు లేదా పెరుగుపై చల్లుకొని తిన‌వ‌చ్చు.

స్మూతీల‌కు ఈ సీడ్స్ ను జోడించ‌వ‌చ్చు.వాట‌ర్ లో నాన‌బెట్టి కూడా ఈ సీడ్స్ ను తీసుకోవ‌చ్చు.

పుష్ప కా బాప్…. చరణ్ సినిమా విడుదల వేళ అల్లు అర్జున్ షాకింగ్ పోస్ట్?