ప‌ర‌గ‌డుపున పెరుగును ఇలా తీసుకుంటే ఎన్ని ఆరోగ్య లాభాలో..?!

పెరుగు.ఎంత రుచిగా ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.

కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, విట‌మిన్ బి, విట‌మిన్ డి, ప్రోటీన్‌, శ‌క్తి వంత‌మైన యాంటీ ఆక్సిడెంట్స్ ఇలా ఎన్నో పోష‌క విలువ‌లు పెరుగులో నిండి ఉంటాయి.

అందుకే ఆరోగ్య ప‌రంగా పెరుగు అనేక ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తుంది.అయితే ఆ ప్ర‌యోజ‌నాలు తీసుకునే విధానంపై కూడా ఆధార‌ప‌డి ఉంటాయి.

ముఖ్యంగా ప‌ర‌గ‌డుపున పెరుగును ఇప్పుడు చెప్ప‌బోయేలా తీసుకుంటే మ‌స్తు ఆరోగ్య లాభాల‌ను పొందొచ్చు.

మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం అస‌లు మ్యాట‌ర్‌లోకి వెళ్లిపోదాం ప‌దండీ.ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల‌ పెరుగును వేసి.

అర స్పూన్ బ్రౌన్ షుగ‌ర్‌ను మిక్స్ చేసుకోవాలి.ఆ త‌ర్వాత ఈ మిశ్ర‌మాన్ని ఉద‌యాన్నే ఖాళీ క‌డుపుతో తినాలి.

ఈ విధంగా ప్ర‌తి రోజు పెరుగును తీసుకుంటే గ‌నుక జీర్ణ వ్య‌వస్థ ప‌ని తీరు చురుగ్గా మారుతుంది.

దాంతో మ‌ల‌బ‌ద్ధ‌కం, గ్యాస్‌, ఎసిడిటీ, క‌డుపు ఉబ్బ‌రం వంటి స‌మ‌స్య‌లు ద‌రి దాపుల్లోకి రాకుండా ఉంటాయి.

"""/"/ అలాగే పెరుగులో బ్రౌన్ షుగ‌ర్‌ను క‌లిపి పర‌గ‌డుపున తిన‌డం వ‌ల్ల రోగ నిరోధ‌క శ‌క్తి రెట్టింపు అవుతుంది.

ఫ‌లితంగా అనేక ర‌కాల జ‌బ్బుల‌కు దూరంగా ఉండొచ్చు.పైన చెప్పిన విధంగా ఉద‌యాన్నే పెరుగు తీసుకుంటే రోజంతా యాక్టివ్‌గా, ఎన‌ర్జిటిక్‌గా ఉంటారు.

ప్ర‌తి ప‌నిలోనూ ఉత్సాహంగా పాల్గొంటారు.ఇక చాలా మందికి మూత్ర విస‌ర్జ‌న స‌మ‌యంలో మంట పుడుతుంటుంది.

అలాంటి వారు పెరుగులో బ్రౌన్ షుగ‌ర్‌ను మిక్స్ చేసి ఉద‌యాన్నే ఖాళీ క‌డుపుతో తీసుకుంటే.

ఆ స‌మ‌స్య నుంచి విముక్తి ల‌భిస్తుంది.అంతే కాదు, పైన చెప్పిన విధంగా పెరుగును తిన‌డం వ‌ల్ల డీహైడ్రేష‌న్ బారిన ప‌డ‌కుండా ఉంటారు.

గుండె ఆరోగ్యం మెరుగు ప‌డుతుంది.మ‌రియు ఒత్తిడి, ఆందోళ‌న‌, త‌ల‌నొప్పి వంటి స‌మ‌స్య‌లు సైతం ద‌రి చేర‌కుండా ఉంటాయి.

నిజ్జర్ హత్యతో దౌత్య సంక్షోభం.. వ్యాపారంలో దూసుకెళ్తోన్న భారత్ – కెనడా!