ఉదయాన్నే వేడి నీళ్లు తాగడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?
TeluguStop.com
చాలామందికి ఉదయాన్నే లేవగానే మంచి నీళ్లు తాగే అలవాటు ఉంటుంది.ఎందుకంటే రాత్రి ఎన్నో గంటలు నిద్రపోయినందుకు మన నాలుక ఎండిపోయి ఉంటుంది.
అందుకే ప్రతి మనిషికి కూడా ఉదయాన్నే లేవగానే నీళ్ల అవసరం ఉంటుంది.అదేవిధంగా ఉదయం లేవగానే వేడి నీళ్లను తాగడం వల్ల మరిన్ని ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయి.
అయితే ఉదయం లేవగానే చల్లని నీరు తాగడం వల్ల ఎన్నో వ్యాధులకు గురవుతాం.
అయితే వీలైనంత వరకు కాచి చల్లార్చిన గోరువెచ్చని నీటిని తాగడం వల్ల ఆరోగ్యానికి శ్రేయస్కరం అందులో ముఖ్యంగా ఉదయం లేవగానే చాలామంది టీ, కాఫీలు లేదా చల్లని నీళ్లు తాగుతూ ఉంటారు.
కానీ వాటికి తగినంత దూరంలో ఉండడం ఆరోగ్యానికి చాలా మంచిది.అందుకే ఉదయం వేళలో లేవగానే అతి ముఖ్యంగా చలికాలంలో ఉదయాన్నే వేడి నీళ్లను తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
అయితే నిద్ర లేవగానే ఉదయాన్నే కాలకృత్యాలు తీర్చుకోవడానికి ముందే రెండు లేదా మూడు గ్లాసుల గోరువెచ్చని నీళ్లు తాగాలి.
"""/"/ అయితే ఆ నీటిని వేగంగా తాగకుండా నోట్లో ఉంచుకుంటూ కొంచెం కొంచెం గుటకలు వేస్తూ తాగాలి.
ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే వేడి నీళ్ళు తాగడం వల్ల చాలా వరకు బరువు కూడా తగ్గుతారు.
అలాగే శరీరంలో రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది.ఇక సీజన్స్ పరంగా వచ్చే వైరల్ ఇన్ఫెక్షన్ల నుండి కూడా వేడి నీరు మన శరీరాన్ని రక్షిస్తుంది.
అలాగే వేడి నీళ్ళు ఉదయాన్నే తాగడం వల్ల రోజంతా ఉత్సాహంగా ఉంటారు.అయితే బరువు తగ్గడానికి కేవలం ఉదయాన్నే కాకుండా రాత్రిళ్ళు కూడా వేడి నీళ్లు తాగితే సులభంగా బరువు తగ్గుతారు.
దీంతో క్రమం తప్పకుండా వేడి నీళ్లు తాగితే శరీరంలో ఉన్న అధిక కొవ్వు కరిగిపోతుంది.
అలాగే ఉబకాయం, కొలెస్ట్రాల్ సమస్య ఉన్న వాళ్లు కూడా తరచూ వేడినీరు తాగడం వల్ల చాలా మంచిది.
అంతే కాకుండా వేడి నీళ్లు తాగడంతో అజీర్తి సమస్యలు కూడా తొలగిపోతాయి.
రోజుకో కప్పు కుంకుమపువ్వు టీ తాగితే ఏం అవుతుందో తెలుసా..?