వెయిట్ లాస్‌తో స‌హా `గ్రీన్ కాఫీ`తో ఎన్ని ఆరోగ్య లాభాలు ఉన్నాయో తెలుసా?

ప్ర‌పంచ‌వ్యాప్తంగా కాఫీ ప్రియులు కోట్ల‌లో ఉన్నారు.కాఫీని( Coffee ) ఒక స్ట్రెస్ బ‌స్ట‌ర్ గా భావించేవారు ఎంద‌రో.

కాఫీలో ఎన్నో ర‌కాలు ఉన్నాయి.అయితే మీరు గ్రీన్ కాఫీని( Green Coffee ) ఎప్పుడైనా తాగారా? గ్రీన్ కాఫీ అనేది రోస్టింగ్ చేయని కాఫీ బీన్స్ నుండి తయారయ్యే కాఫీ.

రోస్టింగ్ ప్రక్రియలో కొన్ని న్యూట్రియెంట్స్ పోతాయి, కానీ గ్రీన్ కాఫీలో అవి ఎక్కువగా ఉంటాయి.

అందువ‌ల్ల ఆరోగ్య ప‌రంగా గ్రీన్ కాఫీ అనేక లాభాల‌ను చేకూరుస్తుంది.ముఖ్యంగా వెయిట్ లాస్( Weight Loss ) అవ్వాల‌ని భావిస్తున్న‌వారు త‌మ రెగ్యుల‌ర్ డైట్ లో ఒక క‌ప్పు గ్రీన్ కాఫీని చేర్చుకుంటే మంచి ఫ‌లితాలు పొందుతారు.

గ్రీన్ కాఫీలో ఉండే క్లోరోజెనిక్ యాసిడ్ కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది.మెటబాలిజాన్ని పెంచి శరీరం వేగంగా కేలరీలు ఖర్చు చేయడానికి తోడ్ప‌డుతుంది.

వెయిట్ లాస్ ను ప్ర‌మోట్ చేస్తుంది. """/" / అలాగే గ్రీన్ కాఫీలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు( Anti Oxidants ) అధికంగా ఉంటాయి.

ఇవి శరీరంలో హానికరమైన ఫ్రీ రాడికల్స్‌ను తొలగించి కణాలను ప్రొటెక్ట్ చేస్తాయి.వృద్ధాప్య లక్షణాలను తగ్గించడంలోనూ హెల్ప్ చేస్తాయి.

మెదడు ఆరోగ్యానికి గ్రీన్ కాఫీ చాలా మేలు చేస్తుంది.గ్రీన్ కాఫీ మానసిక ఉల్లాసాన్ని పెంచి మెద‌డును చురుగ్గా మారుస్తుంది.

స్ట్రెస్‌, డిప్రెష‌న్ వంటి స‌మ‌స్య‌ల‌ను దూరం చేస్తుంది.లివర్ మరియు మూత్రపిండాలను శుభ్రపరిచి శరీరంలో విషతత్త్వాలను తొలగించే సామ‌ర్థ్యం కూడా గ్రీన్ కాఫీకి ఉంది.

"""/" / అంతేకాదండోయ్‌.రోజుకు ఒక క‌ప్పు గ్రీన్ కాఫీ తాగ‌డం వ‌ల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది.

అధిక ర‌క్త‌పోటు స‌మ‌స్య త‌గ్గుతుంది.గ్రీన్ కాఫీ జీర్ణాశయాన్ని శుభ్రంగా ఉంచుతుంది.

తిన్న ఆహారాన్ని సులభంగా జీర్ణించుకుందుకునే స‌హ‌క‌రిస్తుంది.గ్యాస్, అజీర్ణం, మలబద్ధకం సమస్యలకు చెక్ పెడుతుంది.

అందుకే గ్రీన్ కాఫీని డైట్ లో చేర్చుకోండి.అయితే గర్భిణీలు, బిడ్డకు పాలిచ్చే తల్లులు, గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారు మాత్రం గ్రీన్ కాఫీ విష‌యంలో డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది.

ఆ విషయంలో వేరే వాళ్ళపై ఆధారపడడం, నమ్మడం నాకు ఇష్టం లేదు: ఉపాసన